భార్య కళ్ల ముందే తల నరికి నడి రోడ్డులో పెట్టారు

మదురై: హత్య కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో భార్య కళ్ల ముందే ఓ వ్యాపారి తల నరికి నడి రోడ్డు మీద పెట్టి వెళ్లిన సంఘటన తమిళనాడులోని మదురై సమీపంలో జరిగింది.

నీలకొట్టాయ్ ప్రాంతంలో అళగురాజా, తేను దంపతులు నివాసం ఉంటున్నారు. అళగురాజా మాంసం వ్యాపారం చేస్తున్నాడు. ఇతని ప్రత్యర్థి వ్యాపారి నాగేష్. కొన్ని వారాల ముందు నాగేష్ అల్లుడు హత్యకు గురైనాడు.

తన అల్లుడిని హత్య చేసిన వారిలో అళగురాజా ఉన్నాడని నాగేష్ పగ పెంచుకున్నాడు. ఇటీవల తిరుమంగళంలో మరణించిన బంధువు అంత్యక్రియలకు హాజరుకావడానికి అళగురాజా భార్య తేనుతో కలిసి వెళ్లాడు.

Man beheaded in public to avenge son-in-law’s murder in Tamil Nadu

అంత్యక్రియలు పూర్తి అయ్యాక సమీపంలోని దుకాణంలోకి వెళ్లారు. అదే సందర్బంలో నలుగురు వ్యక్తులు బైక్ ల మీద షాప్ దగ్గరకు వెళ్లారు. అళగురాజాను బయటకు లాగి అతని తల నరికి నడి రోడ్డులో పెట్టి వెళ్లిపోయారు.

ఈ దాడిలో అళగురాజా భార్య తేనుకు గాయాలైనాయి. తన భర్తను హత్య చేసిన వారిలో మా బంధువు ఒకరు ఉన్నారని తేను పోలీసులకు చెప్పింది. నడిరోడ్డు మీద తల ఉండటంతో స్థానికులు భయంతో హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+