బుల్లెట్లతో పార్లమెంట్‌లోకి వెళ్లే ప్రయత్నం, అడ్డుకున్న భద్రతా సిబ్బంది..

ప్రజాస్వామ్య భారతదేశంలో దేవాలయం పార్లమెంట్. ఇక్కడే చట్టాలు చేసి అమలు పరుస్తారు. పార్లమెంట్‌లోకి ఎంపీలు సహా పాస్ ఉన్న వారిని కూడా అనుమతిస్తారు. అయితే గురువారం పార్లమెంట్‌లోకి ఒకతను వచ్చాడు. కానీ తన పర్సులో బుల్లెట్లు ఉన్న విషయం మరచిపోయాడు. దీంతో సిబ్బంది చెక్ చేయగా.. బుల్లెట్లు కనిపించాయి. వెంటనే అతనిని సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన షబీర్ ఖాన్ కుమారుడు అక్తర్ ఖాన్ (44) గురువారం పార్లమెంట్‌కు వచ్చాడు. గేట్ 8 గుండా అతని రాగా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే పర్సులో బుల్లెట్లు కనిపించాయి. దీంతో వెంటనే సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. .32 బోర్ గన్‌కి చెందిన బుల్లెట్లు తన పర్సులో పెట్టుకొని అక్తర్ ఖాన్ మరచిపోయాడు. అతనిని పోలీసులు విచారించారు. తర్వాత మరచిపోయాడని నిర్ధారించుకొని వదిలేశారు.

Man carrying bullets tries to enter Parliament..

ఆ బుల్లెట్లు అక్తర్ ఖాన్ తుపాకీకి చెందినవి అని పోలీసులు గుర్తించారు. దానికి లైసెన్స్ కూడా ఉందని పేర్కొన్నారు. కానీ పొరపాటున బుల్లెట్లు కూడా పెట్టుకొని వచ్చారని తెలిపారు. అతనిని విచారించి.. ధృవీకరించుకొన్న తర్వాత వదిలేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+