బీహార్ సీఎం నితీష్ కుమార్ కోసం ... నాలుగో వేలు కట్ చేసుకుని మొక్కు తీర్చుకున్న వీరాభిమాని

బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ హయాంలో మరోమారు నితీష్ కుమార్ సీఎంగా ప్రభుత్వ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నితీష్ కుమార్ సీఎం అయితే మొక్కు చెల్లించుకుంటానన్న ఒక వీరాభిమాని ఏకంగా ఆయన చేతి వేలినే కట్ చేసుకున్న ఘటన బీహార్లోని జహానాబాద్ లో చోటుచేసుకుంది.

నాలుగో వేలు కట్ చేసుకుని గోరయ్య బాబాకు సమర్పించిన నితీష్ అభిమాని

నాలుగో వేలు కట్ చేసుకుని గోరయ్య బాబాకు సమర్పించిన నితీష్ అభిమాని

సహజంగా రాజకీయ నాయకుల కోసం అభిమానులు మొక్కుతూ ఉంటారు. అయితే ఎవరు ఇలా తమని తాము శారీరకంగా హింసించుకోవడానికి, శరీర భాగాలను కట్ చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ బీహార్లోని జహానాబాద్ కు చెందిన అనిల్ శర్మ అనే వ్యక్తి సీఎం నితీష్ కుమార్ కోసం తన చేతి నాలుగో వేలును కట్ చేసుకున్నారు. ఇక ఆ వేలిని గోరయ్య బాబా ఆలయంలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నితీష్ కుమార్ తన అభిమాన నాయకుడిని, ఆయన ఎన్నికల్లో గెలిచి మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆయన కోసం చేతివేలిని మొక్కుగా చెల్లించకుంటానని మొక్కుకున్నానని పేర్కొన్నారు అనిల్ శర్మ. అందులో భాగంగానే తన చేతి నాలుగో వేలిని కట్ చేసుకున్నా అని చెప్పారు.

 నితీష్ సీఎం కావాలని మొక్కు .. వేళ్ళు కట్ చేసుకుంటూ మొక్కు చెల్లిస్తున్న అనీల్ శర్మ

నితీష్ సీఎం కావాలని మొక్కు .. వేళ్ళు కట్ చేసుకుంటూ మొక్కు చెల్లిస్తున్న అనీల్ శర్మ

45 సంవత్సరాల వయసున్న అనిల్ శర్మ నితీష్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు సార్లు చేతివేళ్లను కట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా నవంబరు 16వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు వేలు కూడా కత్తిరించి దేవుడికి మొక్కు చెల్లించారు. నితీష్ కుమార్ పై అనిల్ శర్మకున్న అభిమానం ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉంది. ఆయన గెలిచినప్పుడల్లా తన వేళ్ళలో ఒక్కో దానిని కత్తిరించి గోరయ్య బాబాకు సమర్పిస్తున్నారు.

దేవుడు తన కోరిక మన్నించి నితీష్ ను సీఎం చేశారంటున్న అభిమాని

దేవుడు తన కోరిక మన్నించి నితీష్ ను సీఎం చేశారంటున్న అభిమాని

చేతి వెళ్ళు కత్తిరించి మొక్కులు చెల్లించటం వలన తనకు ఆనందం కలుగుతుందని, దేవుడు తన కోరికను మన్నించి నితీష్ కుమార్ ను సిఎం చేసిన కారణంగానే తన చేతివేళ్ళని సమర్పించానని అనిల్ శర్మ చెబుతున్నారు. ఇక చాలామంది నితీష్ కుమార్ పట్ల అతనికి ఉన్న పిచ్చి అభిమానానికి షాక్ అవుతున్నారు. రాజకీయ నాయకుల పట్ల అభిమానం మాత్రమే ఉంటే చాలని, వాళ్ళ కోసం జీవితం పణంగా పెట్టాల్సిన వసరం లేదనే భావన వ్యక్తం అవుతుంది.

 అభిమానం ఉండొచ్చు ... ఇంతలా కాదంటూ వీరాభిమానిపై చర్చ

అభిమానం ఉండొచ్చు ... ఇంతలా కాదంటూ వీరాభిమానిపై చర్చ

నాయకుల పట్ల అభిమానం ఉండొచ్చు కానీ, తమకు తాము హాని చేసుకునేలా నాయకులకు ఇంత పిచ్చి ఉండటం మంచిది కాదని ఈ సంఘటన తెలిసిన చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. 4 వేళ్ళు కత్తిరించుకున్న ఈ వీరాభిమాని తన జీవితాన్ని సాగించడానికి పని చేయాల్సిన క్రమంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు అంటున్నారు. పిచ్చికి పరాకాష్ట గా పలువురు ఈ సంఘటనను అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా నితీష్ కోసం నాలుగు వేళ్ళు కత్తిరించుకున్న ఈ వీరాభిమాని ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+