'జయలలిత పుత్రుడిపై' హైకోర్టు ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమారుడిగా చెప్పుకొంటున్న వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.శుక్రవారం నాడు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆర్ మహదేవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత , సినీ నటుడు శోభన్ బాబుకు తాను పుట్టినట్టుగా జె కృష్ణమూర్తి అనే వ్యక్తి చెబుతున్నాడు. ఈ మేరకు తనను దత్తత తీసుకొన్న డాక్యుమెంట్లను కూడ ఆయన మద్రాస్ హైకోర్టుకు సమర్పించాడు.

ఈ డాక్యుమెంట్ల ఆధారంగా తనను జయ కుమారుడిగా గుర్తించి ఆమె ఆస్తులను తనకు చెందేలా చూడాలని ఆయన హైకోర్టును కోరారు.జయలలిత నివాసం ఉన్న పోయేస్ గార్డెన్ తో సహ తనకు అప్పగించేలా చూడాల్సిందిగా ఆయన కోరారు.

Man claims to be Jayalalithaa's son, Madras HC threatens to send him to jail

అంతేకాదు తనకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా తమిళనాడు డిజిపిని ఆదేశించాల్సిందిగా కూడ ఆయన హైకోర్టును కోరారు. అన్నాడిఎంకె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబం నుండి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన చెప్పారు.

అయితే ఈ విషయమై ఇవాళ కోర్టు ముందుకు వచ్చాయి. అయితే జస్టిస్ మహదేవన్ మాత్రం డాక్యుమెంటరీ సాక్ష్యాలన్నీ కూడ తప్పుడుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఎల్ కె జి స్టూడెంట్ ముందు ఈ డ్యాక్యుమెంట్లు పెట్టినా సరే వాటిని తప్పుడు డ్యాక్యుమెంట్లుగా చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

జయలలిత తనయుడిగా చెప్పుకొంటున్న కృష్ణమూర్తిని సిటీ పోలీసు కమీషనర్ వద్ద హజరుకావాలని కోరారు. కృష్ణమూర్తి చెబుతున్నట్టుగా ఆయన చూపిస్తున్న డ్యాక్యుమెంట్లు ఒరిజినల్ , డూప్లికేట్ అనే విషయాన్ని పరిశీలించాలని ఆయన పోలీస్ కమీషనర్ ను ఆదేశించారు.

కోర్టులతో ఆడుకోకూడదని జడ్జి మహదేవన్ కృష్ణమూర్తిని తీవ్రంగా హెచ్చరించారు. నిన్ను జైల్లో పెడతానని కూడ తీవ్రంగా మందలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"I can send this man straightaway to jail. I will ask police officers to take him to jail now itself," thundered Justice R Mahadevan of the Madras high court on Friday at a man who claimed himself to be the secret son of former Tamil Nadu chief minister Jayalalithaa who died on December 5.
Please Wait while comments are loading...