ప్రేమించాడు, పెళ్లాడతానన్నాడు.. కానీ, ప్రియురాలిని పలుమార్లు పొడిచి, ఆత్మహత్య, అసలేం జరిగింది?

ముంబై: ఇటీవల కాలంలో పిల్లలు, యువత తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారం వ్యవహరిస్తుండటం ఆందోళనకర పరిస్థితికి దారితీస్తోంది. మంచి చెడు తెలుసుకోలేని వయస్సులోనే ప్రేమ, పెళ్లి అంటూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించే తల్లిదండ్రుల మాటను సైతం లెక్క చేయకుండా జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

18ఏళ్ల యువతిని ప్రేమించిన ఓ 24ఏళ్ళ యువకుడు.. తమ వివాహానికి ఒప్పుకోలేదనే కారణంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రియురాలిని కత్తితో పొడిచి.. అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని మలాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పరిచయం ప్రేమగా..

పరిచయం ప్రేమగా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగేశ్ రాణే(24) హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. కురర్ గ్రామంలోని స్లమ్ రిహబిలిటేసన్ ఆథారిటీ(ఎస్ఆర్ఏ) భవనంలో ఉంటున్నాడు. అదే భవనంలో ఎస్ఎన్‌డీటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న 18ఏళ్ల ప్రాచీ థక్కర్ అనే యువతితో రాణేకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

పెళ్లికి అంగీకరించని యువతి తల్లి..

పెళ్లికి అంగీకరించని యువతి తల్లి..


అయితే, థక్కర్ తల్లి మాత్రం వీరిద్దరి ప్రేమను అంగీకరించలేదు. రాణేకు, ప్రాచీకి 6ఏళ్ల వయస్సు తేడా ఉండటంతోనే థక్కర్ తల్లి వీరి వివాహానికి అంగీకరించలేదని సమాచారం. థక్కర్ తల్లి పెళ్లికి అంగీకరించకపోయినప్పటికీ రాణే వారింటికి వస్తూ ఉండేవాడు. తాను ప్రాచీ లేకుండా బతకాలేనంటూ పలుమార్లు ఆమె తల్లికి చెప్పాడు.

యువతి ఇంటికెళ్లి దారుణంగా..

యువతి ఇంటికెళ్లి దారుణంగా..


ఈ క్రమంలో థక్కర్ తల్లి సోమవారం ఉదయం 10గంటలకు పని మీద బయటకు వెళ్లింది. ప్రాచీ ఒంటరిగా ఇంట్లో ఉంది. మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో రాణే.. ప్రాచీ ఇంటికి వచ్చాడు. వీరి మధ్య పెళ్లి విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కత్తి తీసుకుని థక్కర్‌ను విచక్షణా రహితంగా పొడిచాడు రాణే. ఆ తర్వాత అతడు కూడా చేతిని కత్తితో కోసుకుని భవనం 10వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రక్తపు మడుగులో ప్రాచీ..

రక్తపు మడుగులో ప్రాచీ..

ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. లోపలివైపు గడియ పెట్టి ఉండటంతో తలుపులను బద్దలు చేసుకుని లోపలికి వెళ్లారు పోలీసులు. రక్తపు మడుగులో ఉన్న ప్రాచీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటనా స్థలంలో రెండు కత్తులు ఉండటంతో రాణేనే థక్కర్‌ను పొడిచి చంపాడా? లేక ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+