బెంగళూరు మెట్రో రైలు పట్టాలపై దూకిన ప్రయాణికుడు, ఐటీ హబ్ చరిత్రలో ఫస్ట్ టైమ్ !
కర్ణాటక రాజధాని బెంగళూరులో నమ్మ మెట్రో రైలు పట్టాలపై దూకుతున్న కేసులు రానురాను ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చి 21వ తేదీన గురువారం బెంగళూరు నమ్మ మెట్రో రైలు పట్టాలపైకి ఓ వ్యక్తి దూకిన ఘటన మెట్రో పర్పుల్ లైన్‌లో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు మెట్రో రైలు అత్తిగుప్పె మెట్రో రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ట్రాక్‌పైకి ఓ వ్యక్తి దూకాడు.
బెంగళూరు నమ్మ మెట్రో రైలు ట్యాక్ లో 750 వాట్ల విద్యుత్ ప్రవహిస్తోంది. మెట్రో రైలు పట్టాలపైకి ఓ వ్యక్తి దూకేయడంతో అక్కడ ఉన్న సాటి ప్రయాణికులు, బీఎంఆర్ సీఎల్ సిబ్బంది హడలిపోయారు. వెంటనే విద్యుత్ లైన్లు మొత్తం ఆఫ్ చెయ్యడంతో మెట్రో రైలు సంచారం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వెంటనే మెట్రో రైలు ట్రాక్ పై పడిన వ్యక్తిని బయటకు లాగి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక మెట్రో రైలు కిందకు దూకిన వ్యక్తి మృతి చెందాడు.

బెంగళూరులోని మెజస్టిక్- చల్లఘట్ట మార్గంలోని అత్తిగుప్పె మెట్రో రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. బెంగళూరు నమ్మ మెట్రో రైలు ట్రాక్‌పై దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం బెంగళూరు మెట్రో చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. గతంలో రెండు సార్లు మెట్రో రైల్వే ట్రాక్‌లపై ప్రయాణికులు దూకినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సందర్బంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.
బెంగళూరు మెట్రో రైలు పట్టాలపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని బీఎంఆర్ సీఎల్ అధికారులు చెప్పారు. మాగడి రోడ్డు నుంచి కెంగేరి వెళ్లే మెట్రో ట్రాఫిక్ మైసూరు రోడ్డులోని చల్లఘాట్ నుంచి వైట్‌ఫీల్డ్‌కు వెలుతున్న సమయంలో అత్తిగుప్పే మెట్రో రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
This is to inform that one person has jumped in front of the train at Attiguppe station at the 2.10 pm . Presently trains are running only between Magadi road to Whitefield Feild and no services between magadi road to Challaghatta . fKI
— ನಮ್ಮ ಮೆಟ್ರೋ (@OfficialBMRCL) March 21, 2024
బెంగళూరు నమ్మ మెట్రో ట్రాక్‌పై వ్యక్తి దూకిన ఘటన తెలియగానే మాగడి రోడ్డు నుంచి వైట్‌ఫీల్డ్ వరకు మాత్రమే పర్పుల్ లైన్ నడుస్తోంది. మాగడి రోడ్డు నుంచి చల్లఘాట్ వరకు మెట్రో రైలు సర్వీసును తాత్కాలికంగా నిలిపివేసినట్లు బీఎంఆర్ సీఎల్ అధికారులు తెలిపారు. మెట్రో రైల్వే ట్రాక్ పైకి దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications