నిర్లక్ష్యం ఖరీదు: మృతదేహం చెత్త బండిలో తరలింపుపై చర్యలు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సస్పెండ్...
కరోనా వైరస్ పుణ్యాన మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. అంతకుముందు కొంచెమైనా మనుషుల్లో జాలీ కనిపించేది. కానీ ఇప్పుడు వ్యాధిగ్రస్తులను పురుగుల్లా చూస్తున్నారు. యూపీ బలరాంపూర్ జిల్లా మున్సిపాలిటీలో హృదయ విదారకర ఘటన జరిగింది. సహజ్‌పురకు చెందిన మహ్మద్ అన్వర్ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కుప్పకూలిపోయాడు.
అస్వస్థతతో చనిపోయిన అన్వర్‌కు అంతకుముందు వైద్య సాయం అందించేందుకు ఒక్కరు ముందుకురాలేదు. కానీ చనిపోయాక మాత్రం దగ్గరికీ వచ్చారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి.. మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్తబండిలో తరలించారు. అలా తరలిస్తుండగా కొందరు వీడియో తీశారు. ఆ దృశ్యం మనస్సున ప్రతీ ఒక్కరినీ కలిచివేసింది. నలుగురు మున్సిపల్ సిబ్బంది చెత్త బండీలో మృతదేహాం వేయగా.. పక్కనే ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అధికారులు స్పందించారు. మృతదేహాన్ని తరలించిన నలుగురు మున్సిపల్ సిబ్బంది, చేష్టలుడిగి చూస్తున్న ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందులో బలరాంపూర్ ఎస్సై ఒకరు ఉండగా.. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆ మృతదేహాన్ని కూడా పట్టుకునేందుకు సిబ్బంది ఇష్టపడలేదు అని స్థానికులు తెలిపారు. కరోనా వైరస్ వల్ల దూరంగా ఉండగా, నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్లు ఏకీపారేయడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. చర్యల తీసుకున్నారు. సస్పెన్షన్ వేటు వేశారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని చెబుతున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.
Recommended Video
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications