వీడియో: రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాంపై పరుగులు తీసిన ఆటో..కారణం తెలిస్తే షాక్!
ముంబై: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఓ ఆటోరిక్షా పరుగులు తీసిన ఘటన ముంబైలోని విరార్ వెస్ట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. నొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడానికి ఓ ఆటోడ్రైౌవర్ చేసిన సాహసం అది. అనూహ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆటోను చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆందోళనకు గురయ్యారు. పక్కకు పరుగులు పెట్టారు. అనంతరం అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విరార్ వెస్ట్ ప్రాంతంలో నివసిస్తోన్న ఓ గర్భిణీకి పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయి. దీనితో భర్త ఆమెను తీసుకుని రైలులో ఆసుపత్రికి బయలుదేరారు. కొద్దిరోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల పట్టాలపై వరదనీరు చేరుకుంది. ఫలితంగా- రైలును విరార్ స్టేషన్ లోనే నిలిపివేశారు. మరోవైపు- ఆ గర్భిణీకి పురిటి నొప్పులు తీవ్రతరం అయ్యాయి. దీనితో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆమె భర్త స్టేషన్ బయటికి వెళ్లి ఆటోను మాట్లాడాడు. రైలు నుంచి కిందికి దిగి, స్టేషన్ బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఆ గర్భిణి చేరుకోవడంతో.. ఆటో డ్రైవర్ సాగర్ కమ్లాకర్ గవద్ ఈ సాహసానికి పూనుకున్నాడు,

ఆటోను ప్లాట్ ఫాంపైకి తీసుకెళ్లాడు. గట్టిగా హారన్ కొడుతూ ఆమె ఉన్న బోగీ వైపునకు వెళ్లాడు. గర్భిణీని ఎక్కించుకుని.. సమీపంలోని సంజీవనీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలావుండగా- రైల్వే భద్రతా బలగాలు (ఆర్పీఎఫ్) సాగర్ కమ్లాకర్ పై కేసు నమోదు చేశారు. ప్రైవేటు వాహనాలు ప్లాట్ ఫాంపైకి రాకూడదంటూ అతణ్ని అరెస్టు చేశారు. అనంతరం అతణ్ని రైల్వే కోర్టులో హాజరు పరిచారు. సాగర్ ను అరెస్టు చేయడానికి గల కారణాలను తెలుసుకున్న న్యాయమూర్తి.. ఆయనను ప్రశంసించారు. వెంటనే విడిచి పెట్టాలని ఆర్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించారు.
#WATCH Mumbai:Auto-rickshaw driver took rickshaw on platform at Virar Railway Station on Aug4 to pick a pregnant woman to take her to the hospital.RPF didn't arrest him immediately as the "lady was in extreme labour pain,but he was later arrested&released with a warning by court" pic.twitter.com/eckppwGtr2
— ANI (@ANI) August 6, 2019
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications