విడాకుల స్టోరీ: మత్తు ఇచ్చి భార్యపై వ్యక్తి అత్యాచారం

Man drugs wife, rapes her in Punjab
లూథియానా: తన భార్యకు మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత భర్త ఆమెపై అత్యాచారం చేశాడు. రియల్ ఎస్టేట్ సలహాదారుగా పనిచేస్తున్న అతను తన కార్యాలయంలో భార్యపై అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన లూథియానాలోని భమియన్ కలాన్ ప్రాంతంలో జరిగింది.

ఆ దంపతులిద్దరు వేర్వేరుగా జీవిస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తాను 2008 అక్టోబర్ 4వ తేదీన జనక్‌పురి ప్రాంతానికి చెందిన దీపక్ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదు తెలిపింది. దీపక్ తనను నిత్యం వేధించేవాడని, దాన్ని భరించలేక కూతురు పుట్టిన తర్వాత తాను ఇంటి నుంచి వెళ్లిపోయానని, అప్పటి నుంచి తాను షహీద్ కర్నైల్ సింగ్ నగర్‌లో ఉంటున్నానని ఆమె చెప్పింది.

తన కూతురు తండ్రి వద్ద ఉంటుందని, కూతురిని కలవడానికి అతను తనను కార్యాలయానికి పిలిచేవాడని, ఇటీవల తన కూతురిని కలవడానికి అతని కార్యాలయానికి వెళ్లానని, ఆ సమయంలో తనకు మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయం ఇచ్చాడని, అది తాగి తాను స్పృహ కోల్పోయిన తర్వాత తనపై అతను అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.

బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేయగా పోలీసులు జమాల్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+