రైల్వేస్టేషన్‌లో అందరూ చూస్తుండగానే బలవంతంగా అమ్మాయిని ముద్దు పెట్టాడు(వీడియో)
Recommended Video

ముంబై: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు, పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ.. వారిపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. చాటు మాటునే కాకుండా బహిరంగ ప్రదేశాల్లోనూ మహిళలపై వేధింపులు జరగడం శోచనీయం.
తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ యువతికి అందరు చూస్తుండగానే వేధింపులు ఎదురయ్యాయి. నవీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం ఫోట్లో మాట్లాడుతూ వెళ్తున్న ఓ యువతి వెనకాలే వెళ్లిన ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

#WATCH: Girl molested at Turbhe railway station in Navi Mumbai yesterday; accused has been arrested after complaint #Maharashtra pic.twitter.com/kwUfFhCZZG
— ANI (@ANI) February 23, 2018
అంతేగాక, బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా అక్కడున్నవారు చూస్తున్నారే గానీ, ఆమెకు మద్దతుగా ఎవరూ నిలవకపోవడం విచారకరం. కాగా, ఈ దృశ్యాలన్నీ స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కాగా, ఆ వ్యక్తి తనను స్టేషన్ బయటి నుంచే వెంబడించాడని యువతి చెబుతోంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.. గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు నరేష్ జోషి(43)గా గుర్తించారు.












Click it and Unblock the Notifications