13 ఏళ్ల కింద అమ్మాయిపై రేప్: దోషికి ఏడేళ్లు జైలు

Man gets seven years jail for raping minor 13 years ago
దర్బంగ: 13 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో బీహార్ రాష్ట్రంలోని స్థానిక కోర్టు ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. సునీల్ పాశ్వాన్ అనే నిందితుడిని అదనపు జిల్లా, సెషన్స్ మూడో న్యాయమూర్తి ఎఎన్ తివారీ దోషిగా ప్రకటిస్తూ జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా కూడా విధించారు.

సునీల్ 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అమ్మాయిపై అత్యాచారం చేశాడని, సిమ్రీ పోలీసు స్టేషన్ పరిధిలోని సాద్వారా గ్రామంలో అమ్మాయిని 13 ఏళ్ల క్రితం అపహరించి, ఆమెపై అత్యాచారం చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినయ్ కుమార్ సింగ్ చెప్పారు. బాధితురాలు 2001 జనవరి 2వ తేదీన ఫిర్యాదు చేసింది.

మరో కేసులో ఇద్దరు వ్యక్తులకు న్యాయమూర్తి పదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. 2012 మే 14వ తేదీన మనిగచ్చి పోలీసు స్టేషన్ పరిధిలోని నెహ్రా గ్రామంలోని ఓ ఇంటిలో సాయుధ దోపిడీకి పాల్పడినందుకు వారికి కోర్టు ఆ శిక్ష విధించింది.

దోపిడీ సందర్భంగా ఈస్ట్ చంపారన్ జిల్లా దుమారియా పోలీసు స్టేషన్ పరిధిలోని హుస్సేనీ గ్రామానికి చెందిన వీరేంద్ర సాహ్నీ, సకల్ పాశ్వాన్ ఓ మహిళపై కాల్పులు జరిపి ఆమెను గాయపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+