భార్య ప్రియున్ని చంపేందుకు సుపారీ.. హంతకునికి ఆరు లక్షల విలువైన ఆయుధం గిఫ్ట్‌...

ఢిల్లీ : భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించుకుని భార్య ప్రియుడిని చంపించే ప్రయత్నం చేశాడు. కానీ ప్లాన్ ఫెయిల్ కావడంతో అడ్డంగా బుక్కయ్యాడు. సుపారీ కిల్లర్‌తో పాటు కటకటాలు లెక్కబెడుతున్నాడు.

ఢిల్లీ హరినగర్‌కు చెందిన సోనూ పండిత్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తమ కాలనీకే చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని భావించాడు. తన భార్యను తనకు కాకుండా చేస్తున్నారన్న కారణంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఆ బిజినెస్‌మేన్‌ను అంతమొందించాలని నిర్ణయించి ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను సంప్రదించాడు. రూ.6లక్షలు సుపారీగా మాట్లాడుకున్నాడు. అయితే నగదు రూపంలో కాకుండా ఖరీదైన బెరెట్టా పిస్టల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.

man hired a contract killer, gifted him an expensive pistol to kill wife lover

జులై 23న కాంట్రాక్ట్ కిల్లర్ మర్డర్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించాడు. సదరు బిజినెస్‌మేన్ ఇంటి వద్ద నిఘాపెట్టాడు. ట్యాంకర్లతో నీటి సరఫరా చేసే వ్యాపారం చేసే సదరు వ్యక్తి బాల్కనీలోకి వచ్చిన వెంటనే కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ బుల్లెట్ అతనికి తగలలేదు. పక్కనే ఉన్న కిటికీ నుంచి దూసుకుపోయి గోడలోకి దిగబడింది. వెంటనే అప్రమత్తమైన వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా కుల్వీర్ దాగర్‌ ఈ దాడికి పాల్పడినట్లు తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుంచి పిస్టల్‌తో పాటు రెండు బుుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమ మార్కు విచారణ చేపట్టడంతో కుల్వీర్ అసలు విషయం బయటపెట్టాడు. దీంతో అసలు సూత్రధారిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+