రూపాయి కోసం హత్య: పెళ్లయిన గంటలకే ఆత్మహత్య

మధ్య గౌహతిలోని నగర సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినందుకు మృతుడికి, కండక్టర్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని, ఈ గొడవ సందర్భంగా కండక్టర్ ఆ వ్యక్తిని కిందికి తోసేశాడని, కింద పడిన ఆ వ్యక్తి మీది నుంచి బస్సు వెనక చక్రం వెళ్లిందని చెబుతున్నారు.
ఇదిలావుంటే, బీహార్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువ జంట పెళ్లి చేసుకున్న కొద్ది గంటలకే ఆత్మహత్య చేసుకుంది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లా బిషన్‌పూర్‌లోని ఒక గుడిలో ఇద్దరు సోమవారం రాత్రి పెళ్లి చేసుకున్నారు.
తమది కులాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు అంగీకరించరనే భయంతో పెళ్లి చేసుకున్న కొద్ది గంటలకే వారు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాలు వారు పెళ్లి చేసుకున్న గుడికి సమీపంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications