మద్యం కోసం రూ. 20 చోరీ: చూసిందని బాలిక హత్య

Man kills girl who catches him stealing Rs 20
ముంబై: మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తి పొరుగువారింట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. రూ. 20 దొంగతనం చేస్తుండగా ఆ ఇంట్లోని ఏడేళ్ల బాలిక అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో ఆ విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమోనని భయపడ్డ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబై శివారు ప్రాంతం చెంబూరులో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రకాష్ హజ్రా కుటుంబం, అతని పొరుగింటి వారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారే కావడంతో వీరిద్దరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సోమవారం తన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పి నిందితుడు ప్రకాష్ హజ్రా(30) పొరుగు వారింటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మద్యం కోసం రూ. 20 దొంగిలించేందుకు ప్రయత్నించాడు.

అయితే ఇంట్లో ఉన్న బ్యూటీ సర్కార్(7) అనే బాలిక అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో విషయం బయటికి చెబుతుందేమోనని ఆ బాలికను ప్రకాష్ హజ్రా నీటి ట్యాంకులో ముంచి హత్య చేశాడు. ఆ తర్వాత వారింటికి బయటి నుంచి తాళం వేసి పరారయ్యాడు. ఆ సమయంలో బ్యూటీ సర్కార్ సోదరుడు సాగర్ ఇంటికి సమీపంలోని (10) మైదానంలో ఆడుకుంటున్నాడు.

కాగా, మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో తిరిగివచ్చిన బ్యూటీ తల్లి సోనాలి ఇంటికి తాళం ఉండటాన్ని గమనించారు. తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా బ్యూటీ సర్కారు అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సోనాలి తెలిపింది. అప్పటికే బ్యూటీ మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు ఆమె చెప్పింది. బాధితురాలి సోదరుడు సాగర్.. ప్రకాష్ హజ్రా తమ ఇంటిలోకి వెళ్లగా చూశానని చెప్పడంతో పోలీసులు అతడ్ని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు ప్రకాష్ బాలికను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+