సోదరిని చంపి పోలీసులకు అతను ఫోన్ చేశాడు

జ్యోతి అనే 30 ఏళ్ల మహిళను 27 ఏళ్ల వయస్సు గల ఆమె సోదరుడు మొహిందర్ దక్షిణ ఢిల్లీలోని ఆర్‌కె పురం ప్రాంతంలో కత్తితో పొడిచి చంపేశాడు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆర్కె పురంలోని మూడో సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది.
మొహిందర్‌కు ఉద్యోగం లేదని, సంఘటనను అతనే తమకు తెలియజేశాడని పోలీసులు చెప్పారు. మొహిందర్ శరీరంపై కూడా కొన్ని గాయాలు కనిపించాయి. దాంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.
ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత మొహిందర్‌ను పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. ఆస్తి తగాదాలు ఈ హత్యకు కారణమైన ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications