చపాతీ గుండ్రంగా చేయలేదని భార్యను చంపేశాడు

చపాతీ గుండ్రంగా చేయలేదనే కోపంతో ఓ కసాయి భర్త గర్భిణీ అయిన తన భార్యను హతమార్చిన దారుణ ఘటన ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శనివారంనాడు చోటుచేసుకొంది.

న్యూఢిల్లీ: చపాతీ గుండ్రంగా చేయలేదనే కోపంతో ఓ కసాయి భర్త గర్భిణీ అయిన తన భార్యను హతమార్చిన దారుణ ఘటన ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శనివారంనాడు చోటుచేసుకొంది.

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతానికి చెందిన తన సోదరి సిమ్రాన్ స్పృహ లేకుండా పడి ఉండడాన్ని ఆమె తమ్ముడు పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి సిమ్రాన్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తేల్చారు.

Man kills wife as her chappatis not round

భర్త పరారీలో ఉన్నాడు. శనివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తన తండ్రి చపాతీ గుండ్రంగా చేయలేదనే ఆగ్రహంతో తన తల్లిని కడుపుపై కొట్టాడని మృతురాలి కుమార్తై చెప్పింది. తండ్రి తల్లిని కొడుతోంటే అడ్డుకోబోయిన తనను ఓ గదిలో వేసి తాళం వేసినట్టు ఆ బాలిక చెప్పింది.

సిమ్రాన్‌కు ఐదేళ్ళ క్రితం పెళ్లైందని ఓ పాప ఉందని, ప్రస్తుతం నాలుగు మాసాల గర్భిణీ అని పోలీసులు చెప్పారు. ఇటీవల భర్తకు వ్యాపారంలో నష్టాలు రావడంతో ఫ్యాక్టరీలో పనిచేయమని రెండేళ్ళుగా భర్త భార్యను కోరుతున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+