విదేశాల్లో ఉద్యోగం: అనుమానంతో భార్య హత్య
చెన్నై: భార్య ప్రవర్తపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను తాను కట్టిన తాళితోనే దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసి పారిపోవడానికి ప్రయత్నించిన అతన్ని స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
తమిళనాడులోని పెరంబలూరు జిల్లా శిరువాచూర్ పట్టణంలోని కళవొట్టార్ వీధిలో సోలైముత్తు (40), జ్యోతి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోలై ముత్తు విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు.
కొన్ని నెలల క్రితం సొంతూరుకి వచ్చాడు. ఊరికి వచ్చినప్పటి నుంచి భార్య ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్నాడు. పదేపదే భార్య జ్యోతితో గొడవపడేవాడు. చుట్టుపక్కల వారు సర్ది చెప్పినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.

బెడ్ రూంలో భార్య, భర్త గొడవపడ్డారు. తరువాత సహనం కొల్పోయిన సోలైముత్తు భార్యను చితకబాదేశాడు. తరువాత జ్యోతి నొటిలో గుడ్డలు కుక్కి మెడలో ఉన్న తాళితో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు.
భార్య మరణించిందని తెలుసుకున్న సోలైముత్తు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి అతనిడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications