ఘోరం: ప్రేయసిని చంపి గదిలో పాతిపెట్టాడు
ఇండోర్: తనతో ఘర్షణకు దిగిన ప్రేయసిని చంపి ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పక్కింటి వ్యక్తితో గొడవ పడిన ఆ వ్యక్తి పొరపాటున మాట జారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నా ప్రియురాలిని చంపినట్టే నిన్ను చంపుతాను అని బెదిరించడంతో ఈ హత్య ఉదంతం ఆదివారంనాడు బయటపడింది.
ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గల చందన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజోల్, ఘన్‌శ్యాం అనే ఇద్దరూ ప్రేమికులు. కొద్దిరోజుల క్రితం ఓ విషయంపై తీవ్రంగా గొడవపడ్డారు. కాజోల్ వాదనకు రెచ్చిపోయిన ఘన్‌శ్యాం ఆమెను పదునైన ఆయుధంతో తలపై కొట్టాడు. అక్కడిక్కడే మరణించిన ఆమెను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు.

ఆ ప్రదేశంపైనే మంచం వేసుకొని మూడురోజులుగా నిద్రిస్తున్నాడు. శనివారం పొరుగింటి వ్యక్తితో జరిగిన గొడవ సందర్భంగా ఈ విషయం బయటకు పొక్కిందని చందన్‌నగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో సోదాల అనంతరం టైల్స్ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహాన్ని వెలికి తిశారు. నిందితుడు ఘన్‌శ్యాంను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఘన్‌శ్యాం తన వద్దకు వచ్చి అతని ప్రేయసి విషయంలో గొడవ పడ్డాడని, తన ప్రేయసిని సచిన్ అనే వ్యక్తికి తానే పరిచయం చేశానని, దానివల్ల వారిద్దరు మిత్రులయ్యారని తనపై గత కొద్ది రోజులుగా ఆగ్రహంతో ఉన్నాడని రిష్వత్ పోలీులకు చెప్పాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications