ఆమెకు 23, అతనికి 26: కొన్నాళ్లుగా సహజీవనం.. మధ్యలో స్నేహితురాలు.. కట్ చేస్తే, మర్డర్..

ఔను వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ మధ్యలో యువతి స్నేహితురాలు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అతను.. తనతో సహజీవనం చేస్తోన్న యువతి గొంతుపిసికి చంపేశాడు. తర్వాత ముక్కలు ముక్కలు చేసి.. సూట్‌కేసులో వేశాడు. సూట్ కేసు ఇంట్లో పెట్టి.. ఇంటికి తాళం వేసి మరీ ప్రియురాలితో పారిపోయాడు..

సహజీవనం చేస్తూ..

సహజీవనం చేస్తూ..


బీహర్‌‌లోని వైశాలికి చెందిన 26 ఏళ్ల యువకుడు, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 23 ఏళ్ల యువతితో సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి మధ్యలో మరో యువతి వచ్చింది. దీంతో శుక్రవారం ఇరువురికి మాటా మాటా పెరిగింది. ప్రణాళిక ప్రకారం యువతి గొంతుపిసికి చంపేశాడు. తర్వాత బాడీని సూట్ కేసులో వేసి ఇంట్లో పెట్టాడు. అయితే గొడవ జరిగే సమయంలో అపార్ట్ మెంట్ నుంచి బయటకు అరుపులు వినిపించొద్దని.. మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా పెట్టాడు. పని పూర్తయ్యాక.. కొత్త లవర్‌తో పారిపోయాడు.

హత్య చేసి.. ఇంటికి తాళం

హత్య చేసి.. ఇంటికి తాళం


శుక్రవారం నుంచి ఇంటికి లాక్ ఉంది. కానీ ఆదివారం ఇంటినుంచి దుర్వాసన వచ్చింది. దీంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. మృతదేహాన్ని గుర్తించారు. యువతీ యువకులు ఇదివరకు గ్వాలియర్‌లో పనిచేసేవారని.. ఆ సమయంలో సహజీవనం చేస్తున్నారని ఎస్పీ కమలేశ్ ఉఫాధ్యాయ్ తెలిపారు. ఢిల్లీ వచ్చాక కూడా ఒక్కటే ఈ కామర్స్ కంపెనీలో పనిచేశారు. గత డిసంబర్‌లో 90 మందితో కలిసి ఉత్తరాఖండ్ పరిధిలో గల హరిద్వార్ వచ్చి.. ఇక్కడే ఒక అపార్ట్ మెంట్‌లో ఉంటున్నారు.

Recommended Video

    Omar Abdullah & Karti Chidambaram Slams Ivanka Trump For Her Tweet On Jyoti Kumari
    ఫ్రెండ్ కూడా పరార్

    ఫ్రెండ్ కూడా పరార్

    అయితే యువతి స్నేహితురాలితో యువకుడు సన్నిహితంగా ఉంటున్నారు. దీనిపై వారి మధ్య గొడవ జరుగుతుందిన శుక్రవారం ఎక్కువ కావడంతో హత్యకు దారితీసింది. యువతి మర్డర్ తర్వాత అతని స్నేహితురాలు కూడా కనిపించడం లేదు. దీంతో ఆమె అతనితో పారిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. యువతి ఎక్కడ ఉందో పోలీసులకు సమాచారం అందిందని.. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+