అప్పు తీర్చలేక.. భార్యపై రేప్‌కు అనుమతిచ్చాడు

ఛంఢీఘర్: హర్యానా రాష్ట్రంలోని భివాని జిల్లాలో దారుణం జరిగింది. ఛక్రి దాద్రి ప్రాంతంలోని ఓ వ్యక్తి తాను చేసిన అప్పు తీర్చలేక.. తన సోదరుడు, అతని స్నేహితులను తన భార్యపై అత్యాచారం చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో ఆ దుర్మార్గులు ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూ లైంగిక వేధింపులకు గురిచేశారు.

ఈ ఘటనపై బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీలోని దరియాపూర్‌కు చెందిన బాధితురాలికి(29) ఛక్రి దాద్రి ప్రాంతానికి చెందిన నిందితుడు సంజయ్‌తో వివాహైంది. గత నెలలో తన పుట్టింటికి వెళ్లి వచ్చిన తర్వాత నుంచి తన భర్త సోదరుడు, అతని స్నేహితులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

తన ఇద్దరు పిల్లలను వేసవి సెలవులు కావడంతో తన పుట్టింటికి పంపించినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి భర్త సంజయ్ రూ. 25వేలను అతని సోదరుడు విజయ్ వద్ద అప్పుగా తీసుకున్నాడు. దీంతో ఆ డబ్బు తిరిగివ్వాలని సంజయ్‌పై విజయ్ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అప్పు చెల్లించలేక సంజయ్ తన భార్యను వారికి అప్పగించాడు.

 Man offers wife to brother in exchange of money

దీంతో బాధితురాలిపై విజయ్, అతని స్నేహితుడు హర్కేశ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా తనపై అత్యాచారాలకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. తనకు బలవంతంగా మత్తు ఇంజిక్షన్లు కూడా చేసినట్లు బాధితురాలి తెలిపింది.

సంజయ్ కావాలనే తనను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లేవాడని, అతడు రాత్రిళ్లు తన బాబాయ్ ఇంట్లో ఉండేవాడని చెప్పింది. ఒంటరిగా ఉన్న తనపై భర్త సోదరుడు, అతని స్నేహితుడు వచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడేవారని తెలిపింది. ఇలా తరచూ నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా కొట్టేవారని తెలిపింది.

ఈ క్రమంలో బాధితురాలు తన తల్లిదండ్రులకు ఘటనపై సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ఢిల్లీలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. బాధితురాలు అనారోగ్యంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో కూడా ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు బాధితురాలి భర్త సంజయ్, అతని సోదరుడు విజయ్, విజయ్ భార్య, విజయ్ స్నేహితుడు స్నేహితుడు హర్కేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఛక్రి దాద్రి ఎస్ఐ సుమాన్ బాల తెలిపారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+