దారుణం: భార్య జననాంగాలపై భర్త యాసిడ్ దాడి
భోపాల్: మహిళలపై జరుగుతున్న దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. అదనపు వరకట్నం కోసం ఓ దుర్మార్గుడు తన భార్య జననాంగాలపై యాసిడ్ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెకు కిరోసిన్ తాగించాడు. ఈ దారుణ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీంతో ఆమె జననాంగాలతోపాటు పొత్తికడుపు, తొడలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆమెకు ఎలాంటి వైద్య సహాయం అందించకుండా ఆమెను ఆమె భర్త, అతని కుటుంబసభ్యులు ఓ గదిలో బంధించారు. ఆమె చనిపోయిందని భావించిన నిందితుడు, బాధితురాలి భర్త కళ్యాణ్ అహిర్వార్ ఆమె తండికి ఫోన్ చేసి.. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో హుటాహుటిని వారింటికి చేరుకున్నాడు. కాగా, బాధితురాలు కాసేపటికి స్పృహలోకి రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయాన్ని తండ్రి, వైద్యులకు బాధితురాలు వివరించింది.

దీంతో బాధితురాలి తండ్రి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. బాధితురాలికి కళ్యాణ్ అహిర్వార్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. 2009 నుంచి ఆమెను వరకట్నం కోసం కళ్యాణ్ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2010లో నిందితుడు కళ్యాణ్‌పై వరకట్న వేధింపుల కేసు కూడా నమోదైంది. అయితే రెండు కుటుంబాల మధ్య రాజీ కుదరడంతో వారు కేసు ఉపసంహరించుకున్నారు.
అప్పుడు బాధితురాలిపై ఎలాంటి వేధింపులకు పాల్పడనని హామీ ఇచ్చిన నిందితుడు కళ్యాణ్.. మళ్లీ తరచూ వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బాధితురాలిపై ఈ దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు కళ్యాణ్. కళ్యాణ్ తోపాటు అతని కుటుంబసభ్యులు ఈ దారుణంలో పాల్పంచుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications