నడి రోడ్డులో కత్తితో దాడి చేసి రూ. 17 లక్షలు లూటీ
రాజ్‌కోట్: స్కూటర్ మీద వెళుతున్న యువకుడిని అడ్డగించిన దుండుగులు అతని మీద కత్తితో దాడి చేసి రూ. 17 లక్షలు లూటీ చేసిన సంఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాజ్ కోట్ లోని ప్రయివేటు కంపెనీలో సునీల్ లాల్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం సునీల్ లాల్ సాటి ఉద్యోగితో కలిసి రాజ్ కోట్ లోని బ్యాంకులోకి వెళ్లారు. కంపెనీ అకౌంట్ నుండి రూ. 37 లక్షలు డ్రా చేశారు. తరువాత అక్కడే సునీల్ రూ. 17 లక్షలు బ్యాగ్ లో పెట్టుకున్నాడు.

సునీల్ సాటి ఉద్యోగి రూ. 20 లక్షలు తీసుకుని బైక్ లో వెళ్లి పోయాడు. సునీల్ రూ. 17 లక్షలు తీసుకుని స్కూటర్ లో కంపెనీ దగ్గరకు బయలుదేరాడు. మార్గం మద్యలో ముగ్గురు దుండగులు సునీల్ స్కూటర్ ను అడ్డగించారు. తరువాత నగదు ఇవ్వాలని బెదిరించారు.
సునీల్ నిరాకరించడంతో వారి మద్య ఘర్షణ జరిగింది. అదే సమయంలో నిందితులు కత్తి తీసుకుని సునీల్ ఎడమ చేతి మీద దాడి చేసి నగదు ఉన్న బ్యాగ్ లాక్కోని అక్కడి నుండి పరారైనారు. సునీల్ మీద దాడి చెయ్యడం, నగదు ఉన్న బ్యాగ్ లాక్కోని పారిపోతున్న దృశ్యాలు అదే ప్రాంతంలోని ఇంటికి ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications