వైవాహికేతర సంబంధానికి పట్టు: మగాడి జననాంగాలు కోసేసిన మహిళ

పాట్నా: వైవాహికేతర సంబంధాన్ని కొనసాగించాలని పట్టుబట్టిన ఓ పురుషుడిపై ఓ మహిళ తన ఆగ్రహాన్ని విచిత్రమైన రూపంలో వ్యక్తం చేసింది. అంతకుముందున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఓ మగాడు మహిళను కోరాడు. దాంతో ఆగ్రహించిన మహిళ ఓ వ్యక్తి జననాంగాలను కోసిపారేసింది. ఇందుకు ఆమెకు ఇరుగుపొరుగు వాళ్లు కూడా సాయం చేశారు. ఈ ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో జరిగింది.

బాధితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అశోక్ రాం అనే ఆ వ్యక్తి ఓ మహిళ ఇంట్లోకి బలవంతంగా వెళ్లి, తనతో అంతకుముందున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి చేశాడని పోలీసు అధికారి నౌషాద్ ఆలం తెలిపారు. దాంతో కోపం వచ్చిన ఆమె, ఇరుగుపొరుగుల సాయంతో అశోక్ (26) జననాంగాలను కోసిపారేసింది. అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.

Bihar map

అతడి కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే ఉండటంతో ఇంతవరకు ఎవరూ ఈ ఘటనపై ఫిర్యాదు చేయలేదు. అతనికి చికిత్స చేయించడంలో వారంతా మునిగిపోయారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమెకు గతంలో అశోక్ తో వివాహేతర సంబంధం ఉండేది. అయితే ఈ విషయం అందరికీ తెలియడంతో గ్రామస్థులు నిలదీయగా అశోక్ ఊరు వదిలి వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల క్రితమే తిరిగి వచ్చిన అతడు పాత సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది. మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్తిరం తిరిగి వచ్చి సంబంధాన్ని కొనసాగించాలని మహిళపై ఒత్తిడి పెట్టాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో పురుషాంగాలను కోసేసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+