వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖరీదైన కార్ అమ్మేసి కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలెండర్లు ... పెద్ద మనసు చాటుకున్న ఇద్దరు మిత్రులు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో, ఇద్దరు స్నేహితులు, షహనావాజ్ హుస్సేన్ మరియు అబ్బాస్ రిజ్వి, కరోనావైరస్ రోగులకు మరియు ముంబైలో శ్వాసకోశ సమస్య ఉన్న ఇతర రోగులకు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎవరూ చెయ్యని పని చేశారు. ఇద్దరు మిత్రులలో ఒకరైన షహనావాజ్ హుస్సేన్ తన ఖరీదైన కార్ అమ్మేసి ఆ డబ్బుతో ఉచిత ఆక్సిజన్ సిలిండర్లను కరోనా బాధితులకు అందిస్తున్నారు.

ఆరునెలల గర్భవతి ఆక్సిజన్ లేక మృతి ... కరోనా కాలంలో వారి మనసు మార్చిన ఘటన

ఆరునెలల గర్భవతి ఆక్సిజన్ లేక మృతి ... కరోనా కాలంలో వారి మనసు మార్చిన ఘటన


అబ్బాస్ రిజ్వి ఆరునెలల గర్భవతి అయిన తన సోదరిని ఆక్సిజన్ అందించలేని పరిస్థితిలో కోల్పోయారు. ఈఘటన వారి మనసులను కలచివేసింది .ఆక్సిజన్ సమస్యతో ఇబ్బందిలో ఉన్న ప్రజలకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందించాలనే ఆలోచన వచ్చింది."ఆరు నెలల గర్భవతిగా ఉన్న నా కజిన్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల కన్నుమూశారు. ఆక్సిజన్ సపోర్ట్ పొందడంలో ప్రజలు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో అప్పుడు మేము గ్రహించాము" అని అబ్బాస్ రిజ్వీ చెప్పారు.

ఎస్‌యూవీ కారును కూడా విక్రయించి మరీ కరోనా సేవలు

ఎస్‌యూవీ కారును కూడా విక్రయించి మరీ కరోనా సేవలు


కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిలిండర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి షహనావాజ్ హుస్సేన్ తన ఎస్‌యూవీ కారును కూడా విక్రయించారని చెప్పి స్నేహితుడి గొప్పతనం ఆయన తెలియజేశారు .31 ఏళ్ల షహ్నావాజ్ హుస్సేన్ కరోనా మహమ్మారి సమయంలో, నగరంలోని ఆసుపత్రులలో పడకలు మరియు ఆక్సిజన్‌ సమస్యతో ప్రజలు చాలా కష్టపడుతున్నారు."నగరంలోని ఆసుపత్రుల పరిస్థితిని చూసి, వారికి అత్యవసరంగా అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు అందించాలని మేము నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.

అందరికీ ఎలాంటి బేధాలు లేకుండా సేవలు అందిస్తున్న ఇద్దరు మిత్రులు

అందరికీ ఎలాంటి బేధాలు లేకుండా సేవలు అందిస్తున్న ఇద్దరు మిత్రులు

పేద ,ధనిక అన్న వ్యత్యాసం లేకుండా , హిందూ,ముస్లిం అన్న బేధాలు లేకుండా ఎవరికైనా సాయం అందించాలనే ఈ పని చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఎవరైతే ఒక వైద్యుడి సూచనతో మా వద్దకు వస్తున్నారో వారి ప్రిస్క్రిప్షన్ చూసి వారి అవసరాన్ని బట్టి మేము ముంబైలో ఎక్కడైనా వారికి ఆక్సిజన్ సిలిండర్ లను పంపిణీ చేస్తాము "అని షహనావాజ్ హుస్సేన్ తెలిపారు.

కారు అమ్మి ఆక్సిజన్ సిలెండర్లు కొనుగోలు .. ముంబై వాసుల కోసం వారి పెద్ద మనసు

కారు అమ్మి ఆక్సిజన్ సిలెండర్లు కొనుగోలు .. ముంబై వాసుల కోసం వారి పెద్ద మనసు


తన ఎస్యూవీ కారును అమ్మి, కారు అమ్మిన డబ్బుతో మొత్తం 60 ఆక్సిజన్ సిలిండర్లను కొని, మరో 40 ఆక్సిజన్ సిలిండర్లను అద్దెకు తీసుకున్న షహనావాజ్ హుస్సేన్ పెద్ద మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి, ఈ ఇద్దరు మిత్రులు 250-300 ఆక్సిజన్ సిలిండర్ల వరకు సరఫరా చేస్తున్నారు . ఆక్సిజన్ సిలెండర్లను 48 గంటల పాటు ఉచితంగా అందిస్తారు. రాత్రి సమయంలో సిలిండర్ల అవసరం ఎక్కువగా ఉంటుందని రోజూ కనీసం 10-15 సిలిండర్లు ప్రజలకు ఇస్తామని చెప్పారు . ఇంట్లో ఉండి కరోనాకు చికిత్స పొందుతున్న వారికి ఈ ఆక్సిజన్ సిలెండర్లు అందిస్తున్నారు . అయితే ఈ ఇద్దరు మిత్రులు కరోనా కష్ట కాలంలో ముంబయి వాసులకు చేస్తున్న సాయం మరచిపోలేనిదని అంటున్నారు .

English summary
As the number of COVID-19 cases continue to rise in Maharashtra, two friends, Shahnawaz Hussain and Abbas Rizvi, are providing free oxygen cylinders to coronavirus patients and other patients with respiratory problems in Mumbai amidst the pandemic.The idea of providing free oxygen cylinders to people free of cost came after Abbas Rizvi lost his six-month pregnant cousin as she was not able to get oxygen support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X