ఇదేం గూగుల్ మ్యాప్స్ రా సామి.. అర్ధరాత్రి పొలంలో ఇరుక్కున్న కారు.. చివర్లో అసలు ట్విస్ట్..!

సాధారణంగా ఎవరైన తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే పక్కన ఉన్నవాళ్లను అడుగుతాం. ఎవరూ లేకపోయినా, ఎవరికీ తెలియకపోయినా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అది చూపించిన మ్యాప్ విధంగా వెళ్తుంటాం. కానీ అదే గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ఓ వ్యక్తి మోసపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ సహరాన్ పుర్ జిల్లాలోని దేవ్ బంద్ ప్రాంతంలో జరిగింది. ఫిబ్రవరి 5న మీరట్ కు చెందిన ఫిరోజ్ షామిలీ అనే ప్రాంతానికి కారులో బయల్దేరాడు.

ఫిరోజ్.. తన ఫ్రెండ్ లియాఖత్ ను రోహానా టోల్ ప్లాజా వద్ద కలవాల్సి ఉంది. లియాఖత్ .. ఫిరోజ్ ను సహరాన్ పుర్ మీదుగా రావాలని లొకేషన్ సెండ్ చేశాడు. ఆ లొకేషన్ ప్రకారం ఫిరోజ్ జర్నీ ప్రారంభించాడు. అర్ధరాత్రి 2 గంటలకు అతడి కారు దారి తప్పి పొలం మధ్యలోకి వెళ్లి ఇరుక్కుపోయింది. వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నించినా ఫిరోజ్ కారు పొలంలోనే దిగబడి పోయింది. ఫిరోజ్ కారు దిగి కేకలు వేయడం ప్రారంభించాడు.ఆయన కేకలు విన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి కారును బయటకు లాగారు.

Man Stuck in Field After Trusting Google Maps Help Turns Into a Jumping Incident

అసలు ట్విస్ట్..

కారు బయటకు రాగానే ఓ వ్యక్తి ఫిరోజ్ కారుతో పరారయ్యాడు. మరో ఇద్దరు బైక్ పై ఉడాయించారు.దీంతో ఫిరోజ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అతని మొబైల్ కారులోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఈ ఘటనపై ఫిరోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. సీసీటీవీలను పరిశీలించి నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+