రెస్టారెంట్లో వాగ్వాదం: మద్యం మత్తులో టెక్కీ కాల్చివేత

పోలీసుల కథనం ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వివేక్ శర్మ గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ పి-4లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అతడు తన తండ్రి, బావతో కలిసి సెక్టార్ గామా-1లోని ఎల్లో చిల్లీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. బిల్లు చెల్లింపు సమయంలో వివేక్ శర్మకు మరో కస్టమర్(నిందితుడు)కు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వివేక్ శర్మను తోసేసి బయటికెళ్లిన అతడు, తన కారులోని తుపాకీతో వచ్చి శర్మను కాల్చేశాడు. దీంతో శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు.
నిందితుడ్ని గ్రేటర్ నోయిడాలోని దేవ్లా గ్రామానికి చెందిన రవి(20)గా పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులు ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఓ క్రిమినల్ కేసులో రవి జైలు జీవితం గడిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రవి పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. విస్తృతంగా గాలింపు చేపట్టామని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
నిందితుడు రవితో రెస్టారెంటుకు వచ్చిన రంబీర్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వివేక్ శర్మ జైపీ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీలో గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అతనికి ఆరు నెలల పాప ఉంది. తన సోదరి వివాహాన్ని కూడా మే నెలలో చేయాలని శర్మ కుటుంబం నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications