క్లైమాక్స్ లో గోడ మీద దీపం పెట్టిన ఎంపీ సుమలత, తేల్చుకోలేకపోతున్న మాజీ సీఎం!
బెంగళూరులోని జేపీ నగర్ నివాసం ఎదుట మద్దతుదారులను ఉద్దేశించి మండ్య ఎంపీ సుమలత మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీన సమావేశం నిర్వహించి నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. మండ్యలో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి పోటీ చేయడంతో ఎంపీ సుమలత అంబరీష్ ఎత్తుగడలు, ఆమె నిర్ణయాలు మిస్టరీగా మారింది.
మండ్య ఎంపీ సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా మండ్యలో మళ్లీ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో మండ్య లోక్ సభ ఎన్నికల్లో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి మద్దతిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ గందరగోళాలన్నింటికీ సుమలత తెరతీశారు. బెంగళూరులోని జేపీ నగర్‌లోని ఎంపీ సుమలత అంబరీష్ నివాసంలో శనివారం మండ్య జిల్లాకు చెందిన నాయకులతో కీలక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు మండ్య, మళవళ్లి, మద్దూరు సహా వివిధ ప్రాంతాల నుంచి సుమలత మద్దతుదారులు, రెబల్ స్టార్ దివంగత అంబరీష్ అభిమానులు నాలుగు బస్సుల్లో బెంగళూరులోని సుమలత ఇంటికి వచ్చారు. దాదాపు 500 మందికి పైగా వివిద వాహనాల్లో సుమలత మద్దతుదారులు, అంబరీష్ అభిమానులు ఒక్కసారిగా బెంగళూరులోని ఆమె ఇంటికి తరలివచ్చారు. అంబరీష్ చిత్రపటం పట్టుకుని సుమలతకు మద్దతుగా జేపీ నగరలో ఆమె ఇంటి ముందు నినాదాలు చేశారు.
సుమలత ఇంటి బయట సుమారు వెయ్యి మందికి పైగా గుమిగూడారు. సమావేశం అనంతరం జేపీ నగర్‌లోని తన నివాసం ముందు సుమలత ఓపెన్ టాప్ వాహనంలో ఆమె మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అంబరీష్ మీద అభిమానంతో ఇంత దూరంగా వచ్చినందుకు అందరికి ఆమె కృతజ్ఞతలు అని చెప్పారు. మండ్యలోని అంబరీష్ అభిమాన సంఘాల నాయకులు, సుమలతకు ఇంతకాలం మద్దతు ఇచ్చిన నాయకులందరూ సుమలతకు ఇప్పుడు సంపూర్ణ మద్దతు పలికారు.

అంబరీష్ అభిమానులు, మండ్య ప్రజలు నేటికీ నాకు అండగా నిలుస్తున్నారని, మీరే నా సపోర్ట్, నా బలం అని సుమలత ఉద్వేగంగా అన్నారు. మండ్య ప్రజలు మమ్మల్ని వదిలిపెట్టలేదని, అందుకు అందరికి రుణపడి ఉంటానని సుమలత అన్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై. విజయేంద్రతో ఎంపీ సుమలత చర్చలు జరిపారు. నా నిర్ణయం ముఖ్యమైనది కాదని, తన మద్దతుదారుల నిర్ణయమే నా నిర్ణయం అని, మొదటి రోజు ఏం చెప్పానో, ఈరోజు అదే మాట చెబుతున్నానని సుమలత అన్నారు.
తాను చెప్పిన మాట తాను నిలబెట్టుకుంటానని సుమలత అన్నారు. మండ్య ప్రజలకు చెప్పినట్లు తాను ఇంతకాలం నడుచుకున్నానని, మండ్యలో ఏది చేయాలన్నా నిజాయితీగా చేశానని, పార్లమెంట్‌లో మండ్య గౌరవాన్ని నిలబెట్టాను అని సుమలత చెప్పారు. మొత్తం మీద శనివారం సుమలత ఏదో ఒక నిర్ణయం చెబుతారని అందరూ అనుకున్నా ఆమె చివరికి ఏప్రిల్ 3వ తేదీన తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications