ప్రముఖ నటి, ఎంపీ సుమలతో అమిత్ షా, సీఎం చర్చలు, ఉప ఎన్నికల్లో మద్దతు, క్లారిటీ!

బెంగళూరు/మండ్య: కర్ణాటకలో డిసెంబర్ 5వ తేదీన శాసన సభ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పరువు ప్రతిష్టతో పాటు ఆ పార్టీ అధికారంలో ఉండటానికి ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉప ఎన్నికల్లో ఎవరి మద్దతు అయినా సరే తీసుకోవాలని అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖుల మద్దతు తీసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, ప్రముఖ నటి సుమలత మద్దతు ఎవరికి అనే విషయంపై ఇంత కాలం చర్చ జరిగింది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఎంపీ సుమలతతో చర్చలు జరిపారని తెలిసింది.

మండ్య జిల్లో ఉప ఎన్నికలు

మండ్య జిల్లో ఉప ఎన్నికలు

మండ్య జిల్లాలోని కేఆర్ పేట్, హుణసూరు శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ ఎంపీగా విజయం సాధించిన ప్రముఖ నటి సుమలత తన మద్దతు ఎవరికి ? అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు.

అమిత్ షా, సీఎం చర్చలు

అమిత్ షా, సీఎం చర్చలు

కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మండ్య ఎంపీ సుమలతతో చర్చలు జరిపారని తెలిసింది. మండ్య జిల్లాలోని కేఆర్ పేట్, హుణసూరు శాసన సభ నియోజక వర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం యడియూరప్ప ఎంపీ సుమలతకు మనవి చేశారని సమాచారం.

మండ్యకు ప్రత్యేక నిధులు !

మండ్యకు ప్రత్యేక నిధులు !

మండ్య లోక్ సభ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ది చెయ్యడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం యడియూరప్ప ఎంపీ సుమలతకు హామీ ఇచ్చారని తెలిసింది. మండ్య జిల్లాను మరింత అభివృద్ది చెయ్యడానికి పూర్తిగా సహకరిస్తామని, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున మీరు ప్రచారం చెయ్యాలని అమిత్ షా, సీఎం యడియూరప్ప ఎంపీ సుమలతకు మనవి చేశారని తెలిసింది.

బీజేపీకి జై కొట్టిన సుమలత

బీజేపీకి జై కొట్టిన సుమలత

ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చెయ్యడానికి ప్రముఖ నటి, ఎంపీ సుమలత అంగీకరించారని సమాచారం. త్వరలో సుమలత రెండు నియోజక వర్గాల్లో తన అభిమానులు, అనుచరులతో కలిసి బీజేపీ అభ్యర్థుల తరపున ఉప ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

మండ్య లీడర్లకు సీఎం హామీ

మండ్య లీడర్లకు సీఎం హామీ

లోక్ సభ ఎన్నికల సమయంలో సుమలతా గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేసిన మండ్య బీజేపీ సీనియర్ నాయకుడు సచ్చిదానందకు నామినేటెడ్ పదవి ఇవ్వడానికి సీఎం బీఎస్. యడియూరప్ప గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమలతతో పాటు దివంగత రెబల్ స్టార్ అంబరీష్ అభిమానులు సైతం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+