కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
కేంద్రమంత్రి మేనకాగాంధీ శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యారు.
లక్నో: కేంద్రమంత్రి మేనకాగాంధీ శుక్రవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న మేనకాగాంధీ అస్వస్థతకు గురికావడంతో ఫిలిబిత్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది.ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఆమెను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేనకాగాంధీ శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారని తొలుత భావించారు. అయితే ఈ వార్తలను ఆసుపత్రి వర్గాలు కొట్టిపారేశాయి.

గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రాథమిక చికిత్స పూర్తిచేసిన తర్వాత కేంద్రమంత్ని మేనకాగాంధీని ఢిల్లీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications