బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cooker bomb: కుక్కర్ బాంబు కేసులో ట్విస్ట్, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈడీ సోదాలు. అమ్మమ్మ ఇంటిలో కూడా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలోని మంగళూరు కుక్కర్ బాంబు కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఎన్ఐఏ అధికారుల ఎంట్రీతో కుక్కర్ బాంబు కేసులో ఊహించని పేర్లు బయటకు వస్తున్నాయి. కుక్కర్ బాంబు కేసు ప్రధాన నిందితుడు మోహమ్మద్ షారిక్ అలియాస్ షారిక్ అవ్వ ఇంటిలో బుధవారం ఈడీ, ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

too much: మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరోక కాల్ లో మాట్లాడుతున్నారు, భార్య టూమచ్ గా బాయ్ ఫ్రెండ్ తో ?too much: మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి మరోక కాల్ లో మాట్లాడుతున్నారు, భార్య టూమచ్ గా బాయ్ ఫ్రెండ్ తో ?

కుక్కర్ బాంబు నిందితుడు షారిక్ కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలను ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లిలోని కాంగ్రేస్ పార్టీ పట్టణ కార్యాలయం నిందితుడు షారిక్ కుటుంబ సభ్యులకు చెందిన భవనం కావడంతో అక్కడ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. షారిక్ కుటుంబ సభ్యుల భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండటంతో ఆ పార్టీకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

Mangaluru cooker bomb case effect, ED officials searched house of accuseds grandmother, office of Congress party in Karnataka.

షారిక్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి భవనం అద్దెకు ఇచ్చిన సమయంలో రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారా ? అని ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే తిమ్మన రత్నాకర్ సోదరుడి కుమారుడు కేఎం. గోపాలక్రిష్ణ అలియాస్ కేజీ నవీన్ పెట్టారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?

2015 జూన్ నెలలో ఆసీమ్ అబ్దుల్ మజీద్ అలిమాస్ అబ్దుల్ మజీద్ (భవనం యజమాని)కి రూ, 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకడు నెలకు రూ, 1,000 అద్దె చెల్లించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారని వెలుగు చూసింది. మాజీ ఎమ్మెల్యే తిమ్మన రత్నాకర్ రెంటల్ అగ్రిమెంట్ పత్రాలను ఈడీ అధికారులకు ఇచ్చి విచారణకు సహకరించారని తెలిసింది.

Mangaluru cooker bomb case effect, ED officials searched house of accuseds grandmother, office of Congress party in Karnataka.

మా ఇంటి మీద ఈడి అధికారులు దాడులు చేశారని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మాకు కుక్కర్ బాంబు నిందితుడు షారిక్ కు ఎలాంటి ంబందం లేదని, మా ఇంటి మీద ఈడీ అధికారులు దాడి చేసినా రూ. 10 వేల కంటే ఎక్కువ డబ్బులు చిక్కదని, మా మీద తప్పుడు ప్రచారం చెయ్యడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిమ్మన రత్నాకర్ బుధవారం తీర్థహళ్లిలో మీడియాకు చెప్పారు.

English summary
Mangaluru cooker bomb case effect, ED officials searched house of accused's grandmother, office of Congress party in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X