సెంట్రల్ జైలులో గ్యాంగ్ వార్: డాన్ హత్య
మంగళూరు: జిల్లా సెంట్రల్ జైలులో రెండు వర్గాల మద్య జరిగిన గ్యాంగ్ వార్ లో ముఠా నాయుడితో సహ ఇద్దరు ఖైదీలు దారుణ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. మాడూరు యూసఫ్ (ముఠా నాయకుడు), గణేష్ శెట్టి అనే ఇద్దరు ఖైదీలు హత్యకు గురైనారు.
సోమవారం ఉదయం మంగళూరు నగర పోలీసు కమిషనర్ మురుగన్ సెంట్రల్ జైలు చేరుకుని సంఘటనా స్థలంలో పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం వేకువ జామున యూసఫ్, గణేష్ శెట్టి హత్యకు గురైనారని వివరించారు. పదునైన తల్వార్ తో ఇద్దరిని అతి దారుణంగా హత్య చేశారని చెప్పారు.
సెంట్రల్ జైలులోకి తల్వార్ ఎలా వచ్చింది అని విచారణ చేస్తున్నామని మురుగన్ అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా సెంట్రల్ జైలు ఆవరణంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బర్క్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాతక్షక్షలు, రెచ్చిపోయిన గ్యాంగ్ స్టర్లు!
మాఫియా ముఠా నాయకుడు విక్కి శెట్టి అనుచరులు అకాష్ భవన్ శరణ్ తదితరులు మంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అనేక క్రిమినల్ కేసులు నమోదు కావడంతో యూసఫ్ ను ఇంటర్ పోల్ సహాయంతో విదేశాలలో అరెస్టు చేసి తీసుకువచ్చారు.
యూసఫ్ సహా మంగళూరు సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. విక్కి శెట్టి వర్గీయులు, యూసఫ్ వర్గీయుల మద్య గ్యాంగ్ వార్ ఉంది. సోమవారం వేకువ జామున ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఇదే సందర్బంలో యూసఫ్ తో పాటు గణేష్ శెట్టి హత్యకు గురైనాడు. ఆరుగురు ఖైదీలకు తీవ్రగాయాలు కావడంతో వారిని వెన్ లాక్ ఆసుపత్రికి తరలించారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం వలనే బ్యారెక్ లోకి తల్వార్ వెళ్లిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications