మణిపూర్‌లో సైనికులపై మిలిటెంట్ల దాడి: 20 మంది మృతి
షాజాపుర్: మణిపూర్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. గురువారం చాందెల్ జిల్లాలో భద్రతాదళాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
బోర్డర్ విధులు నిర్వహించుకుని మోతుల్ నుంచి మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై ఒక్కసారిగా మెరుపుదాడికి దిగారు. మృతి చెందిన వారిలో 1 జూనియర్ కమిషనర్ ఆఫీసర్, 7 ఓఆర్‌లు, 1 ఎస్ఐజీ కానిస్టేబుల్, 1 ఏఎస్‌సీ ఉన్నట్లు తెలుస్తోంది.
Around 8:30 am, ambush was laid by unidentified militant outfit on 6 Dogra convoy under Tengnoupal Police Station,Chandel District (Manipur)
— ANI (@ANI_news) June 4, 2015 సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని గాయపడిన వారని ఆసుపత్రికి తరలించారు. మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో మణిపూర్‌లో చోటు చేసుకున్న అతిపెద్ద మిలిటెంట్ల దుశ్యర్యగా అధికారులు అభివర్ణించారు.
10 army personnel killed including 1 JCO, 7 ORs, 1 SIG constable, 1 ASC Driver and 12 injured. Convoy was coming from Motul towards Imphal.
— ANI (@ANI_news) June 4, 2015 











Click it and Unblock the Notifications