మణిపూర్ ఆరని మంటలు-ఇవాళ మరో ఐదుగురి కాల్చివేత- 54కు చేరిన మృతులు..
ఈశాన్య రాష్ట్రంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య నెలకొన్న ఘర్షణలు తారాస్ధాయికి చేరడంతో మృతుల సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చినా ప్రయోజనం కనిపించడం లేదు. ఇవాళ మరో ఐదుగురిని పోలీసులు కాల్చిచంపడంతో మొత్తం మృతుల సంఖ్య 54కు చేరుకుంది. దీంతో మణిపూర్ లో తిరిగి కల్లోలం రేగింది.
మణిపూర్ లో చోటు చేసుకుంటున్న జాతి హింసలో మరణించిన వారి సంఖ్య 54కి చేరుకుందని అధికారులు ఇవాళ ప్రకటించారు. మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌లో భద్రతా బలగాలు మెయిటీస్‌ను ఖాళీ చేయిస్తున్నప్పుడు నలుగురు వ్యక్తుల్ని కాల్చిచంపారు. ఇంఫాల్‌లో మరొకరు మరణించారు. అధికారికంగా చనిపోయిన 54 మందిలో 16 మృతదేహాలను చురాచంద్‌పూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచగా, 15 మృతదేహాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 23 మంది మరణించినట్లు అధికారిక సమాచారం. చురచంద్‌పూర్‌లో రాష్ట్రంలోని మెజారిటీ మెయిటీ వర్గం, కుకీ తెగ మధ్య రోజుల తరబడి తీవ్ర ఘర్షణల తర్వాత హింస చోటు చేసుకుంది. ఆ ప్రాంతం నుండి మెయిటీస్‌ను ఖాళీ చేయించడంలో ఆదివాసీలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కాల్పులు జరిగాయి.
ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ (ATSUM) పిలుపు మేరకు చేపట్టిన 'గిరిజన సంఘీభావ యాత్ర' సందర్భంగా మణిపూర్‌లో తొలుత హింస చెలరేగింది. ఏప్రిల్ 19 మణిపూర్ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని మెయిటీ వర్గాన్ని ఎస్టీ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా మార్చ్ నిర్వహించారు. అనంతరం హింస మరింత పెరిగింది. ఇందులో భారీగా మరణాలు కూడా చోటు చేసుకుంటుండంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి.












Click it and Unblock the Notifications