కాంగ్రెస్‌కు భారీ షాక్: మణిపూర్ పార్టీ అధ్యక్షుడు సహా 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీలోకి!

ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. ఇప్పుడు మణిపూర్ కాంగ్రెస్ నేతలు కూడా అదే పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో జరుగనుండగా మణిపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితోపాటు 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవిందస్ కొంతోజమ్‌తో పాటు 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామ చేశారు. వీరంతా మంగళవారం బీజేపీలో చేరతారని సమాచారం. కొంతోజమ్ ఆరుసార్లు విష్ణుపూర్ సీటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం గమనార్హం. కొంతోజమ్‌ను 2020 డిసెంబర్‌లో మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు.

Manipur Congress President Resigns; 8 Party MLAs may Join BJP Today

వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడానికే ప్రయత్నాలు చేస్తానని కొంతోజమ్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి పూడ్చలేని నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Recommended Video

    కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా

    అయితే, నెల రోజుల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, సీఎం బీరేన్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కొంతౌజమ్.. ఆకస్మాత్తుగా బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీమా చేస్తామని ప్రకటించడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కీలక నేతలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇదే మరో భారీ షాక్ అనే చెప్పాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+