మణిపూర్ బలపరీక్షలో బీజేపీ విజయం - మూజువాణితో బీరేన్ సేఫ్ - స్పీకర్‌పైకి కుర్చీలు విసిరిన కాంగ్రెస్
మణిపూర్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సోమవారం భారీ రచ్చ చోటుచేసుకుంది. తామిచ్చిన తీర్మానంపై కాకుండా, అధికార పక్షం కోరిన విధంగా విశ్వాసపరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో హంగామా చేశారు. స్పీకర్ కేమ్ చంద్ సింగ్ పోడియంపైకి కుర్చీలు విసిరేసి గలాటా సృష్టించారు. ఆ గందరగోళం మధ్యలోనే మూజువాణి ఓటు ద్వారా నిర్వహించిన బలపరీక్షలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించినట్లు స్పీకర్ ప్రకటించారు.
''విశ్వాస పరీక్షలో మేమే గెలిచాం. స్పీకర్ అడుగడుగునా రూల్స్ ప్రకారమే వ్యవహరించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు మా వైపే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కు సరిపడా బలం లేదు''అని బలపరీక్షలో గెలుపొందిన అనంతరం సీఎం బీరేన్ సింగ్ మీడియాతో అన్నారు. విశ్వాసపరీక్షలో విజయం సాధించిన ఆయనకు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్ చార్జి రాంమాధవ్ అభినందనలు తెలిపారు.

మొత్తం 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 35 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నుంచి 4, నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) నుంచి 4, ఎల్జేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అధికార కూటమిలో గొడవలే బపరీక్ష పరిస్థితులకు దారి తీశాయి.

బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి జూన్ 14న ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ లో చేరారు. వాళ్లలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు ఎన్‌పీపీ ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షకు కాంగ్రెస్ డిమాండ్ చేసేలోపే.. ఎన్‌పీపీ అధినేత సంగ్మా(మేఘాలయ సీఎం) జోక్యంతో ఎమ్మెల్యేలు తిరిగి బీజేపీ కూటమిలో చేరారు. ఏది ఏమైనా బలపరీక్ష నిర్వహించాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ జులై 28న స్పీకర్ కు తీర్మానం పంపింది. కానీ దాన్నాయన స్వీకరించలేదు. బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రభుత్వమే కోరడంతో ఆ మేరకు సోమవారం డేట్ ఫిక్స్ చేశారు. తమ తీర్మానంపై కాకుండా ఏకపక్షంగా నిర్వహించిన బలపరీక్ష అక్రమమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications