Manipur elections: తొలిదశలో బరిలో ఉన్న 173మంది అభ్యర్థుల్లో దాదాపు 21శాతం మందిపై క్రిమినల్ కేసులు
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన జరగాల్సి ఉండగా తేదీని మార్చి ఎన్నికల సంఘం అధికారులు ఫిబ్రవరి 28వ తేదీన పోలింగ్ జరగనున్నట్టు పేర్కొని తొలి విడత ఎన్నికల పోలింగ్ ను రీషెడ్యూల్ చేశారు. మొత్తం మణిపూర్ లో 38 నియోజకవర్గాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 22 నియోజకవర్గాలలో రెండో దశ ఎన్నికల పోలింగ్ మార్చి 5వ తేదీన జరగనుండగా, మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

173 మంది అభ్యర్థుల్లో దాదాపు 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి అభ్యర్థుల విషయంలో విశ్లేషణ అందించింది. తొలి దశలో పోటీ చేస్తున్న 173 మంది అభ్యర్థుల్లో దాదాపు 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దాదాపు 16 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషణాత్మక నివేదికలు శుక్రవారం వెల్లడించాయి.

పార్టీల వారీగా క్రిమినల్ కేసులు ఉన్నవారి డేటా ఇదే
ప్రధాన రాజకీయ పార్టీలలో, క్రిమినల్ కేసులు ఉన్న వారి డేటా చూస్తే అధికార బిజెపికి చెందిన 38 మంది అభ్యర్థులలో 11 మంది అంటే మొత్తం 29 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని విశ్లేషణ పేర్కొంది. కాంగ్రెస్‌కు చెందిన 35 మంది అభ్యర్థులలో 8 మంది అంటే మొత్తం అభ్యర్థుల 23 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి.
28 మంది అభ్యర్థులలో ఏడుగురు అంటే మొత్తం 25 శాతం జనతాదళ్ యునైటెడ్ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి . 27 మంది అభ్యర్థులలో ముగ్గురు అంటే మొత్తం 11 శాతం మంది నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)కి చెందిన అభ్యర్థులు పై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏ డి ఆర్ విశ్లేషణ పేర్కొంది.

వయస్సుల వారీగా అభ్యర్థుల డేటా ఇదే
ఇదిలా ఉంటే 2017లో మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎన్‌పీఎఫ్ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న మొత్తం 23 మంది మొత్తం 13 శాతం అభ్యర్థులు తమ వయస్సు 25 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండగా, 115 మంది అభ్యర్థులు 66 శాతం మంది తమ వయస్సు 41 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ప్రకటించారు. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 173 మంది అభ్యర్థుల్లో 15 మంది (9 శాతం) మహిళా అభ్యర్థులు ఎన్నికల పోరులో బరిలో ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications