ఉగ్రదాడి: సీఎం భద్రతకు వెళ్తున్న 4గురు పోలీసులు మృతి
మణిపూర్ రాష్ట్రంలోని లోక్‌చావోలో గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు.
లోక్‌చావో: మణిపూర్ రాష్ట్రంలోని లోక్‌చావోలో గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబి సింగ్ కార్యక్రమానికి భద్రత నిమిత్తం సిబ్బంది మోరహ్ నుంచి తెంగనౌపల్ జిల్లాకు వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి తెగపడినట్లు సమాచారం.

పేలుడు పదార్థాలు, తుపాకులతో కాల్పులు జరిపి ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా హైఅలర్ట్‌ను ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications