మణిపూర్ మకుటం: బగ్ పట్టాడు...ఫేస్‌బుక్ నుంచి బహుమానం కొట్టాడు
మణిపూర్ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో బగ్ కనుగొన్నందుకు గాను మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల సివిల్ ఇంజినీర్ జోనెల్ సౌగాయిజం ఫేస్‌బుక్ సంస్థ 5000 డాలర్లు బహుమానం ప్రకటించింది. అంతేకాదు ఆయన పేరును ఫేస్‌బుక్ హాల్‌ఆఫ్ ఫేమ్ 2019లో చేర్చింది. మొత్తం 94 మందికి హాల్‌ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించగా అందులో జోనెల్ స్థానం 16గా ఉంది.
వాట్సాప్ యాప్‌లో వాయిస్ కాల్ సందర్భంగా రిసీవర్‌కు తెలియకుండానే లేదా వారి ఆమోదం లేకుండానే ఈ బగ్ కాలర్ ఆడియో కాల్‌ను వీడియో కాల్‌లోకి మార్చడాన్ని జోనెల్ కనుగొన్నాడు. ఆ సమయంలో రిసీవర్ ఏమి చేస్తున్నాడో వీడియో ద్వారా స్పష్టంగా కనిపించేది. అంటే ఇది వ్యక్తిగత నిబంధనలు అతిక్రమించడమే అని జోనెల్ వెల్లడించాడు. ఈ బగ్‌ను కనుగొన్న వెంటనే ఫేస్‌బుక్ సంస్థకు తెలిపినట్లు వెల్లడించాడు.మార్చిలో ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు జోనెల్ తెలిపాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీమ్ ఈ సమస్యను 15 నుంచి 20 రోజుల్లో చక్కబెట్టింది.

జోనెల్ తమ దృష్టికి తీసుకొచ్చిన బగ్‌పై బాగా స్టడీ చేసి 5వేల డాలర్లు బహుమానంగా ఇవ్వాలని భావించినట్లు ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ-మెయిల్ ద్వారా తనకు సమాచారం పంపినట్లు జోనెల్ ధృవీకరించాడు. అంతేకాదు ఫేస్‌బుక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తన పేరును కూడా చేర్చినట్లు ఆయన చెప్పాడు. ఇదిలా ఉంటే వాట్సాప్ యాప్‌ను ఫేస్‌బుక్ సంస్థ 2014లో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications