ఢిల్లీలో మణిపురి పిహెచ్‌డి స్కాలర్ దారుణ హత్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దారుణాలు ఆగడం లేదు. తాజాగా మణిపూర్‌కు చెందిన జింగ్‌రామ్ కెన్గో (33) అనే పిహెచ్‌డి స్కాలర్‌ను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత దండగులు పారిపోయారు. జింగ్‌రామ్ రక్తం మడుగులో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు.

మణిపురి పిహెచ్‌డి స్కాలర్ హత్య ఘటన ఢిల్లీలోని కోట్ల ముబారక్‌పూర్ ప్రాంతంలో గత రాత్రి జరిగింది. జింగ్ రామ్ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Manipuri TISS PhD scholar found murdered in south Delhi

దోచుకోవడానికి చేసిన హత్యగా ఇది కనిపించడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జింగ్ రామ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. మృతుడు జింగ్ రామ్ నెల క్రిమే మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో అతను పిహెచ్‌డి చేస్తున్నాడు.

ఇంటికి వెళ్తుండగా జింగ్ రామ్‌పై దుండగులు దాడి చేశారు. అద్దెకు ఉన్న ఇంట్లో జింగ్ రామ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. జింగ్ రామ్ తలపై కూడా గాయాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+