ప్రత్యర్థులను సీరియస్‌గా తీసుకుంటా: మోడీపై పిఎం

న్యూఢిల్లీ: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విసురుతున్న సవాల్‌ను ఎదుర్కోవడంలో కాంగ్రెసు సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం ఖండించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా 2014 ఎన్నికలకు కాంగ్రెసు పార్టీ ఆత్మవిశ్వాసంతో వెళ్తుందని ఆయన అన్నారు.

తమది అత్యంత సంఘటితమైన పార్టీ అని, ప్రతిపక్షం శక్తిని తాము తక్కువ అంచనా వేయబోమని ఆయన అన్నారు. ప్రత్యర్థులను సీరియస్‌గా తీసుకునేవారిలో తానూ ఒక్కడినని, ఇందులో ఏ విధమైన నిర్లక్ష్యానికి తావు లేదని ఆయన అన్నారు. హిందస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో కీలకోపన్యాసం చేసిన తర్వాత వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

Manmohan on Modi

రాజకీయ వ్యవస్థ మొత్తం అవినీతిమయమైందని విమర్శిస్తూ ద్వేషాన్ని పెంచడానికి ప్రయత్నించడాన్ని ఆయన తప్పు పట్టారు. కొంత మంది రాజకీయ వ్యవస్థ మొత్తం అవినీతమయమైందని, ప్రజావ్యతిరేకంగా మారిందని ప్రచారం చేస్తున్నారని, పార్లమెంటుపై గౌరవం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ఫలితాలతో సంబంధం లేకుండా కాంగ్రెసు ఆత్మవిశ్వాసం స్ఫూర్తితో వచ్చే లోకసభ ఎన్నికలను ఎదుర్కుంటుందని ఆయన చెప్పారు. మత హింస బిల్లు వోట్లను కొల్లగొట్టే జిమ్మిక్కు కాదని ఆయన అన్నారు. అల్లర్లను నివారించాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+