పోయేవారు: మాజీ ప్రధాని మన్మోహాన్ టైమ్స్ సంచలన కథనం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 11, 2007న రష్యా అధికారిక పర్యటనకు ఆయనను తీసుకు వెళ్లిన 'ఎయిర్ ఇండియా వన్' విమానం ల్యాండింగ్ గేర్ వల్ల కుప్పకూలి ఉండేదని అందులో పేర్కొంది.

బోయింగ్ 747 రకానికి చెందిన విమానంలో అప్పటి ప్రధాని మన్మోహన్ తన సిబ్బందితో కలిసి మాస్కో ఎయిర్ పోర్టుకు చేరుకున్న వేళ, తృటిలో అత్యంత ఘోర ప్రమాదం తప్పిందని ఆ కథనంలో వెల్లడించింది. ఎయిర్ ఇండియా వన్ విమానం మాస్కో ఎయిర్ పోర్ట్‌లో రన్‌వేకు సమీపించిన సమయంలో ల్యాండింగ్ గేర తెరచుకోలేదు.

దీనిని గమనించిన మాస్కో ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) వెంటనే పైలట్‌కు సమాచారం ఇచ్చి, వార్నింగ్ లైట్లు వెలిగించారని ఫ్లయిట్ డేటా రికార్డర్ (ఎఫ్టీఆర్)లో ఉందని టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాత మరోసారి ప్రయత్నించిన పైలెట్ ల్యాండింగ్ గేర్ సరిగ్గా వేసి విమానాన్ని దించారు.

Manmohan Singh's Plane Nearly Crashed During Moscow Landing

పైలెట్ అప్రమత్తంగా లేకుంటే, ల్యాండవుతూనే విమానం పేలి ఉండేదని అందులో పేర్కొంది. అయితే ఇటీవల కాలంలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహాన్ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ గేరు సరిగ్గా తెరకోని సందర్భం ఒకటి ఉందని ఓ పైలట్ తెలపడంతో ఇప్పుడీ వార్త పెను సంచలనమైంది.

మరోవైపు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ల్యాండింగ్ గేర్ తెరుచుకోని పక్షంలో విమానం పేలే అవకాశం లేదని జూనియర్ పైలెట్లకు ట్రైనింగ్ ఇచ్చే సీనయిర్ కమాండర్ అన్నారు. ఎఫ్‌డీఆర్ డేటా ప్రకారం విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ల్యాండింగ్ గేర్ తెరచుకోని పక్షంలో రన్‌వేను సమీపించగానే కాక్ పిట్‌లో అలారం బెల్స్ మోగుతాయని తెలిపారు.

అయితే ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటి వరకు స్పందించ పోవడం విశేషం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sources told TOI that on November 11, 2007, Air India One flying the then Prime Minister Manmohan Singh on an official visit to Russia did not lower its landing gear as required when it was approaching to land in Moscow.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X