నరేంద్ర మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పని చేశారు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్
Click here to see the BBC interactive
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారని, కానీ ఆయన ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు.
ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు.
అదానీ సంస్థలకు చెందిన రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని, ఇందులో చాలా బ్యాంకులు, ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టాయన్నారు. అదానీ గ్రూప్ విషయం గురించి కనీసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు. దేశంలో పెట్టుబడులు పెట్టే వారు ఇవన్నీ చూస్తారని అన్నారు.
అన్ని రంగాల్లోనూ దేశం తీవ్రంగా నష్టపోయిందని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తం 192 దేశాల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ర్యాంకు 139గా ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్‌ల కంటే మన ఆర్థిక వ్యవస్థ ర్యాంకునే తక్కువగా ఉందని చెప్పారు.
నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే పరిమితమయ్యారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
https://twitter.com/TelanganaCMO/status/1624700591242117120
'బీబీసీని బ్యాన్ చేయాలంటారా? ఇదేం ప్రజాస్వామ్యం?’
''గోద్రాపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని బ్యాన్ చేశారు. అంతేకాక భారత్‌లో బీబీసీ ఛానల్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదన్నారు.
ఎల్‌ఐసీని అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నష్టం వస్తే సమాజం నెత్తిన పెడుతూ, లాభం వస్తే ప్రైవేట్‌కు అప్పజెబుతున్నారని విమర్శించారు. అంతులేని ప్రైవేటైజేషన్ చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ అని, ఇదొక నమ్మకం అన్నారు.
''యూపీఏ హయాంలో గ్రోత్ రేటు మోదీ హయాంలో సగానికి పడిపోయింది’’
కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటే, మోదీ వచ్చాక 5.8 శాతానికి పడిపోయిందన్నారు. యూపీఏ హయాంలో గ్రోత్ రేటు 24 శాతం ఎక్కువని అన్నారు. మోదీ హయాంలో ఇది సగానికి సగం పడిపోయిందన్నారు.
ఎగుమతులు పెంచకుండా దేశ అభివృద్ధి పెంచడమంటే అర్థరహితమన్నారు.
మోదీ ఏం మాట్లాడకుండానే అంతా జరిగిపోతుందన్నారు. కేంద్రం తీరుతో తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయిందన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలన్నారు.
140 ఏళ్లలో ఎప్పుడూ ఆగని జనాభా గణన, ప్రస్తుతం ఆగిందన్నారు. అది వస్తేనే దేశ పరిస్థితి తెలుస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి:
- గుజరాత్: మామను, బావను చంపిన హంతకుడిని ఈ ట్రక్కు వెనక రాసిన అక్షరాలే పట్టించాయి...
- లిథియం: జమ్మూకశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?
- కోటె ప్రసన్న వెంకటరమణ ఆలయం: ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?
- పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
- రక్తహీనత: మన శరీరంలో రక్తం ఎందుకు తగ్గిపోతుంది, మళ్లీ పెరగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications