వారికీ క్రెడిట్, మోడీకి మాత్రం ఎక్కువ: సర్జికల్ స్ట్రయిక్‌పై పారికర్
న్యూఢిల్లీ: గతంలోను సర్జికల్ స్ట్రయిక్ దాడులు నిర్వహించామన్న కాంగ్రెస్ పార్టీ వాదనలను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ బుధవారం నాడు తోసిపుచ్చారు. సెప్టెంబర్ 29న ఎల్వోసీలో చేసిన సర్జికల్ దాడులను ఇండియన్ ఆర్మీ అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందన్నారు.
సర్జికల్ స్ట్రయిక్ పైన అనుమానాలు ఉన్న వారు వారు తీసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే ఎక్కువ శాతం మాత్రం ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ఆర్మీకి దక్కుతుందన్నారు. అసలు, సర్జికల్ దాడులు నిర్వహించింది రాజకీయ పార్టీలు కాదన్నారు.
ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న పారికర్ మాట్లాడారు. ఈ క్రెడిట్ భారతీయులందరికీ దక్కుతుందన్నారు. చివరకు ఈ దాడులపై అనుమానాలు వ్యక్తంచేసిన వారికి కూడా ఈ క్రెడిట్‌లో వాటా ఉంటుందన్నారు.

ఈ సర్జికల్ స్ట్రయిక్ చేయాలని నిర్ణయించి, అమలుపరిచేందుకు తగిన ప్రణాళికను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్మీకి మాత్రం ఎక్కువ క్రెడిట్ దక్కుతుందున్నారు. ప్రజల మనోభావాలు తమకు అర్థమయ్యాయని, వారంతా ఈ దాడులపై సంతృప్తిగా ఉన్నారన్నారు.
ప్రధాని మోడీ పాలనలో భారత సరిహద్దు ప్రాంతాలు భద్రంగా ఉన్నాయని మనోహర్ పారికర్ చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 15 కిలోమీటర్ల పరిధిలో ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిందన్నారు. సైన్యం ఎనిమిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌లో కనీసం 35 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. భారత్ అనుసరిస్తోన్న శాంతియుత విధానాన్ని బలహీనతగా చూడకూడదన్నారు.
సర్జికల్ స్ట్రయిక్ పైన పోస్టర్లు
సర్జికల్ స్ట్రయిక్ దాడులను పొగుడూతూ, మోడీ సర్కారుకు క్రెడిట్ ఇస్తున్న పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇలాంటివి ఏర్పాటు చేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పినప్పటికీ ఈ పోస్టర్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా యూపీలోని లక్నోలో ఇలాంటి పోస్టర్ మరొకటి వెలిసింది.
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రశంసిస్తూ, వారిని 'యూరీ అవెంజర్స్'గా కీర్తిస్తున్న పోస్టర్ ఒకటి వెలిసింది. యూరీ ఎవెంజెర్స్ వెల్‌కం... అంటూ కట్టిన బ్యానర్లు కట్టారు. దీనిపై స్పందించిన స్థానిక బీజేపీ నేతలు.. ఈ బ్యానర్లతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications