వేధింపుల ప్రతీకారం: 4గురు పోలీసుల హత్య(పిక్చర్స్)
రాయ్‌పూర్: మూడు రోజుల క్రితం(సోమవారం) అపహరించిన నలుగురు కానిస్టేబుళ్లను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. మొదటగా బాధిత పోలీసులను ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వారు అపహరించారు. గుండ్మా గ్రామంలో మావోయిస్టులు మంగళవారం రాత్రి జన్ అదాలత్ (ప్రజా కోర్టు) నిర్వహించారని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలోనే నలుగురు జవాన్లపై కాల్పులు జరిపారని తెలిపారు. కుర్తు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రహదారిపై నలుగురు పోలీసుల మృతదేహాలు పడివున్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు. మృతులను జయ్‌దేవ్ యాదవ్, మంగళ్ సోధి, రాజు తేలా, రామ మజ్జిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
మృతదేహాల పక్కన మావోయిస్టులు కొన్ని ప్రకటనలు ఉంచారు. వారు చేసిన దాడిని వాటిలో సమర్థించుకున్నారు. అమాయక గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని, తప్పుడు కేసుల్లో నిర్బంధిస్తున్నారని వాటిలో పేర్కొన్నారు. అందుకే ఈ దాడిచేసినట్లు వెల్లడించారు.
కాగా, కానిస్టేబుళ్లపై మావోయిస్టుల దాడిని పిరికిపందల చర్యగా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు. తమ ప్రభుత్వ అభివృద్ధి చర్యలు చూసి ఒర్వలేక ఈ దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఈ చర్యలు మావోయిస్టుల్లో క్రూరత్వాన్ని బయటపెడుతున్నాయని విమర్శించారు. అనంతరం మృతులకు సంతాపం ప్రకటించారు.

మృతులు
మూడు రోజుల క్రితం(సోమవారం) అపహరించిన నలుగురు కానిస్టేబుళ్లను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు.
మృతులు

మృతులు
మొదటగా బాధిత పోలీసులను ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వారు అపహరించారు. గుండ్మా గ్రామంలో మావోయిస్టులు మంగళవారం రాత్రి జన్ అదాలత్ (ప్రజా కోర్టు) నిర్వహించారని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.

మృతులు
ఈ కార్యక్రమంలోనే నలుగురు జవాన్లపై కాల్పులు జరిపారని తెలిపారు. కుర్తు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రహదారిపై నలుగురు పోలీసుల మృతదేహాలు పడివున్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు.

మృతులు
మృతులను జయ్‌దేవ్ యాదవ్, మంగళ్ సోధి, రాజు తేలా, రామ మజ్జిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

మృతులు
మృతదేహాల పక్కన మావోయిస్టులు కొన్ని ప్రకటనలు ఉంచారు. వారు చేసిన దాడిని వాటిలో సమర్థించుకున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications