మావోయిస్టుల ఘాతుకం: ఫ్యామిలీ ముందే గొడ్డళ్ళతో నరికి బీజేపీ నేత దారుణ హత్య
మావోయిస్టులు రెచ్చిపోయారు. వివాహ వేడుకకు వెళ్ళిన ఓ బీజేపీ నేతను కుటుంబం ముందే దారుణంగా నరికి హతమార్చారు. ఆపై శవం వద్ద లేఖ వదిలి వెళ్ళారు.
చత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై వెళుతున్న బిజెపి నేతను మావోలు దారుణంగా హతమార్చారు. ఓ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు హాజరై వెళుతున్న బిజెపి నేతను మావోయిస్టులు కుటుంబ సభ్యుల సమక్షంలోనే దారుణంగా నరికి చంపారు.

మావోయిస్టుల దాడిలో బీజేపీ నేత హతం
బీజపూర్ జిల్లా ఆవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెకారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్ బీజేపీ అధ్యక్షుడు కెక్కెమ్ నీలకంఠ పై మావోయిస్టులు దాడి చేసి దారుణంగా నరికి చంపినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా ఉసూరు బ్లాక్ మోడల్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న నీలకంఠ నిన్న పైక్రమ్ లోని తమ పూర్వీకుల గ్రామంలో పెళ్ళికి వెళ్ళిన సందర్భంలో ఆయుధాలతో దాడి చేసే హత్య మార్చారని ఏసిపి చంద్రకాంత్ గవర్నర్ తెలిపారు. మావోయిస్టు పార్టీకి చెందిన నక్సల్స్ గొడ్డళ్ళు మరియు కత్తులు ఇతర పదునైన ఆయుధాలతో కుటుంబ సభ్యుల ముందే నీలకంఠ పై దాడి చేసి హతమార్చారు అని తెలిపారు.

గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే గొడ్డళ్ళు, కత్తులతో దాడి
నీలకంఠను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లి వివాహ వేడుకకు వచ్చిన వారందరి సమక్షంలో, గ్రామస్తులందరూ చూస్తుండగా, కుటుంబ సభ్యుల ముందు దారుణంగా నరికి చంపారని ఆపై అక్కడ నుంచి పారిపోయారని పోలీసులు వెల్లడించారు. అందరి ముందు తన భర్తను మావోయిస్టులు దారుణంగా హతమార్చారని, వద్దని బతిమాలినా వినకుండా ఘాతుకానికి పాల్పడ్డారని నీలకంఠ భార్య లలిత కన్నీరు మున్నీరు అవుతున్నారు. తీవ్ర గాయాల పాలైన నీలకంఠను ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడని దుఃఖిస్తున్నారు.

బీజేపీ నేతను హతమార్చటం కోసం 150 మందికి పైగా మావోయిస్టులు
నీలకంఠను హతమార్చడం కోసం 150 మందికి పైగా సాయుధ మావోయిస్టులు గ్రామానికి వచ్చినట్లు సమాచారం అందిందని అయితే ముగ్గురు మాత్రమే బిజెపి నాయకుడు హాజరైన వివాహ వేడుక జరుగుతున్న ఇంటి వద్దకు చేరుకొని, దాడికి పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. మావోయిస్టులు సాధారణ దుస్తుల్లో ఉన్నారని, దీనికి సంబంధించిన వీడియోలు తమ స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

ఇన్ ఫార్మర్ నెపంతో బీజేపీ నేత హతం.. మావోల లేఖ
పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్న కారణంగానే మావోయిస్టులు బిజెపి నేతను హతమార్చారని తెలుస్తుంది. ఈ మేరకు మృతదేహం వద్ద మావోయిస్టులో లేఖ వదిలి వెళ్లారు. ఎవరైనా సరే ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తే సహించేది లేదని, ఇన్ఫార్మర్ గా వ్యవహరించే వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు ఆ లేఖలో హెచ్చరించారు. ఈ ఘటనతో మావోలు పోలీసులకు కూడా సవాల్ విసిరారు. ప్రస్తుతం చత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు బిజెపి నేతను హతమార్చిన ఘటన కలకలంగా మారింది. ఈ ఘటనతో స్థానికంగా మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న పలువురు నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications