వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోల పంజా: బస్సును పేల్చడంతో ఓ జవాను ముగ్గరు పౌరుల మృతి

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. వారం రోజుల క్రితం దంతెవాడ జిల్లాలో దాడి చేసి ఇద్దరు పోలీసులతో పాటు ఒక దూరదర్శన్ కెమెరామెన్‌ కూడా మృతి చెందాడు. ఆ ఘటన మరువక ముందే అదే దంతెవాడ జిల్లాలో మరోసారి అన్నలు దాడులు చేశారు. బచేలీలో జరిగిన ఈ దాడిలో ఓ పోలీసుతో పాటు ముగ్గురు పౌరులు మృతి చెందారు. దీంతో మరో నాలుగు రోజుల్లో ఎన్నికలకు వెళ్లనున్నచత్తీస్‌గఢ్‌ రాష్ట్రం లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది.

దంతెవాడ జిల్లా బచేలీ కొండ ప్రాతంలో మావోలు విరుచుకుపడ్డారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది తమ విధులను ముగించుకుని మార్కెట్లో కూరగాయలు కొని బస్సులో క్యాంపుకు చేరుకుంటున్న సమయంలో మావోలు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఒక సీఐఎస్ఎఫ్ జవానుతో పాటు ముగ్గురు పౌరులు మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు పౌరులు బస్సు డ్రైవరు, కండక్టరు, క్లీనర్లుగా గుర్తించారు. మరో నాలుగు రోజుల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎస్ఐఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో పహారా కోసం దిగాయి.

Maoists attack a bus in Chattisgarh,CISF jawan, 3 civilians killed

ఛత్తీస్‌గడ్‌లో వారం రోజుల సమయంలోనే రెండు దాడులు జరగడంపై అక్కడి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మావోలు ఈ ఘటనతో మరోసారి తమ ఉనికిని చాటుకున్నారు. ఒక వారం క్రితమే దంతెవాడ జిల్లా బస్తర్‌లో నక్సల్స్ దాడి చేయడంతో ఓ పోలీసుతో పాటు దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ మృతి చెందాడు. ఆ తర్వాత మీడియాపై దాడి చేయడం తమ ఉద్దేశం కాదని మావోలు లేఖ విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 12న, 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

English summary
A CISF jawan and three civilians were killed in an improvised explosive device (IED) blast triggered by Maoists in poll-bound Chhattisgarh's Dantewada district on Thursday. The blast took place on a bus near Bacheli in Dantewada and multiple casualties were reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X