రెచ్చిపోయిన మావోలు: మందుపాతర పేలుడు, 13 మంది జవాన్లు మృతి
రాయపూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతగుఫా వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సోమవారంనాడు 13 మంది కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలకు (సిఆర్‌పిఎఫ్‌కు) చెందిన 13 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.

ఈ ఏడాది మావోయిస్టులు చేసిన అతి పెద్ద దాడుల్లో ఇది మొదటిది. మృతుల్లో ఇద్దరు అధికారులు, 13 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. గత నెలలో సుక్మా జిల్లాలో జరిగిన సంఘటనలో గాయపడిన ఆరుగురు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది, ఓ ఐఎఎఫ్ కమెండోను తరలిస్తుండగా నక్సలైట్లు భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌పై దాడి చేశారు.
సోమవారం సంఘటన జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపటి నుంచి దండకారణ్యంలో మావోయిస్టులు అమర వీరుల వారోత్సవాన్ని తలపెట్టారు. సిఆర్‌పిఎఫ్ ఎదురు దాడి చేయకుండా ప్రజలను మావోయిస్టులు కవచాలుగా వాడుకున్నట్లు సమాచారం. సిఆర్‌పిఎఫ్‌పై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు.












Click it and Unblock the Notifications