కంగనాకు సపోర్ట్: ఆమె చెప్పింది నిజమే, మరాఠీ నటుడు విక్రమ్

ఇటీవల కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. పలువురు ఖండిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం 1947లో కాదు 2014లో వచ్చిందని కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అందరూ కంగనాను విమర్శించే వారే ఉన్నారు. చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే కంగనా వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో గోఖలే మాట్లాడారు. కంగనా రనౌత్ చెప‍్పింది నిజమేనని అన్నారు.

2014లోనే..

2014లోనే..


1947లో భారతదేశానికి వచ్చింది భిక్ష అని... 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాకే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందిని కంగనా అన్నారు.కంగనా రనౌత్ వ్యాఖ్యలతో తను ఏకీభవిస్తున్నానని విక్రమ్ గోఖలే వివరించారు. స్వాతంత్ర్యం ఇచ్చారు. కానీ స్వాతంత్ర్య సమరయోధులను ఉరితీసినప్పుడు చాలా మంది మూగ ప్రేక్షకులుగా మాత్రమే ఉన్నారు. వీరిలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారు పోరాడుతున్న స్వాతంత్ర్య సమరయోధులను రక్షించలేదని గోఖలే అన‍్నారు. మరాఠీ థియేటర్, బాలీవుడ్, టెలివిజన్‌లో చేసిన పాత్రలతో గోఖలే గుర్తింపు పొందారు.

రాజకీయ లబ్ది

రాజకీయ లబ్ది


బీజేపీతో సహా ప్రతి రాజకీయ పార్టీ వివాదాల నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని గోఖలే అభిప్రాయపడ్డారు. త్రిపురలో జరిగిన మత హింస, అమరావతి, మహారాష్ట్రలోని ఇతర నగరాల్లో రాళ్ల దాడి ఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. మతపరమైన అల్లర్లు ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితమేనని.. ప్రతి రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడుతుందని గోఖలే పేర్కొన్నారు.

కలిసి రావాలె

కలిసి రావాలె


మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గోఖలే మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం మాజీ మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ మళ్లీ కలిసి రావాలని ఆకాంక్షించారు. 'బీజేపీ, శివసేన మళ్లీ కలిసి రావాలని.. సీఎం పదవిని సమానంగా పంచుకునే షరతుపై రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యమేనా అని దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశ్నించాను. రెండు పార్టీలు ప్రయత్నించాలని. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు.. రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయకూడదని భావిస్తున్నానని వివరించారు. ప్రజలు వారిని శిక్షించగలరని విక్రమ్‌ గోఖలే తెలిపారు. అంటే ఎన్నికల సమయంలో తగిన బుద్ది చెబుతారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+