వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:రూ.1.13 లక్ష కోట్ల నుంచి రూ.28 వేల కోట్లు, గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన పన్ను వసూల్.

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ రూ.28 వేల 309 కోట్లు వసూల్ అయ్యాయి. ఇది గతేడాది మార్చితో పోలిస్తే చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ రూ.1.13 లక్షల కోట్ల పన్ను వసూల్ కాగా.. ఈసారి రూ.28 వేల కోట్లకు పడిపోయింది. పన్ను చెల్లింపు ఆందోళన కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి దేశంలో లాక్ డౌన్ విధించింది మార్చి 24వ తేదీ నుంచి.. అంటే అప్పటివరకు వ్యాపార, వాణిజ్య కార్యకలపాలు యథావిధిగా కొనసాగాయి. కానీ పన్ను మాత్రం వసూల్ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నెల ప్రారంభంలో తయారీ, దిగుమతులు పరిమితం చేయడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. రాష్ట్రాలలో రూ.50 వేల కన్నా ఎక్కువ విలువైన వస్తువుల రవాణా చేయడానికి ఇ-వే బిల్లులు అవసరం. అయితే ఇది మార్చిలో శాతం తగ్గగా.. ఏప్రిల్‌లో అది 80 శాతానికి చేరింది.

March GST Collection Sinks to Rs 28,309 Crore, Down From Rs 1.13 Lakh Crore

ఆర్థిక ఉద్దీపన ప్రకటించాలని డిమాండ్ వస్తోన్న క్రమంలో పన్ను తక్కువ వసూల్ కావడం కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తోంది. మరోవైపు ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పెంచితే బాగుంటుందని ఆర్థికశాఖ భావిస్తోన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే మార్చి రిటర్నులు మే 5వ తేదీ వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినందున.. పన్ను వసూళ్లు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. మే, జూన్‌లో మాత్రం పరోక్ష పన్ను వసూల్ మరింత తగ్గుతోందని మాత్రం అంగీకరించారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడానికి మరింత సమయం పడుతోందని అంచనావేశారు. ఏదేమైనా తొలి త్రైమాసికంలో వస్తువులు, సేవలకు సంబంధించి వ్యాపారం పరిమితం కావడంతో పన్నులు కూడా తక్కువ ఉంటాయని తెలిపారు.

English summary
goods and services tax collection for March slipped to a record low of Rs 28,309 crore as on April 29, sources told. This compares with Rs 1.13 lakh crore recorded in the same month last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X