వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను బలవంతంగా అనుభవిస్తే రేప్ కాదు: కనిమొళి ప్రశ్నకు మంత్రి జవాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇష్టం లేకున్నా, ఆమె అంగీకారం లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా కలిస్తే అది భారత సందర్భంలో నేరం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేశారు. డిఎంకె సభ్యురాలు కనిమొళి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆ విషయం స్పష్టం చేశారు.

భర్త బలవంతంగా అనుభవించినా (మారిటల్ రేప్) అది రేప్ కాదనే మినహాయింపు ఐపిసిలోని 375 సెక్షన్‌లో రేప్ నిర్వచనంలో ఉందని చెబుతూ దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా అని కనిమొళి అడిగారు. మహిళలపై వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి భారత్ ఈ మేరకు చట్ట సవరణ చేయాలని, మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని సూచించిన విషయం నిజమేనా అని ఆమె అడిగారు.

Marital rape

భార్యకు ఇష్టం లేకపోయినా, ఆమె అంగీకారం లేకుండా బలవంతపెట్టి శారీరకంగా కలిస్తే అది విదేశాల్లో నేరమేనని, అది అత్యాచారం కిందికే వస్తుందని, అయితే, అంతర్జాతీయంగా దీనికి నిర్వచనం వేరని, భారత్‌లోని భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీన్ని మన దేశంలో అత్యాచారంగా నిర్వచించలేమని, అలాంటి బిల్లు తెచ్చే ఆలోచన ఏదీ లేదని, భర్తలకు మినహాయింపు ఇస్తున్న 375ని సవరించే యోచన లేదని మంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేశారు.

మహిళ అంగీకారం లేకుండా ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది నేరమేనని, అది రేప్ కిందికే వస్తుందని, అది పెళ్లాడిన భర్త కావచ్చు, సహజీవనం చేస్తున్న వ్యక్తి కావచ్చు, ప్రేమికుడు మరెవరైనా కావచ్చు అని అంతర్జాతీయంగా ఇచ్చిన నిర్వచనం. ఇది భారతదేశంలో అమలులో లేదు.

English summary
Despite mounting international pressure, India cannot criminalise marital rape with the NDA government citing various reasons such as “Indian mindset to treat marriage as a sacrament” to justify the move.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X